ఒక నిమ్మకాయ తో ఇంట్లోకి దోమలు రావు.. ఎలానో తెలుసా?

First Published | Nov 25, 2024, 1:08 PM IST

ఈ కింది రెమిడీలు వాడితే.. శాశ్వతంగా ఇంట్లోకి దోమలు రాకుండా అరికట్టవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం…

mosquito

చల్లటి వాతావరణంలో ఇంట్లోకి దోమలు  ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక.. ఈ దోమలు మనకు చాలా రకాల అనారోగ్య సమస్యలు తెస్తూ ఉంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను ఈ దోమలు మోసుకువస్తాయి. ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేందుకు చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దోమతెరలు వాడటం, దోమలు రాకుండా స్ప్రేలు కొట్టడం లాంటివి చేస్తారు. కానీ, వాటివల్ల  దోమలు కాసేపు పోయినట్లు అనిపిస్తాయి కానీ.. మళ్లీ వచ్చేస్తాయి. అదే.. ఈ కింది రెమిడీలు వాడితే.. శాశ్వతంగా ఇంట్లోకి దోమలు రాకుండా అరికట్టవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం…

Image: Freepik

మీకు వాము ఆకులు తెలుసా? ఇంట్లో కూడా వాటిని మనం పెంచుకోవచ్చు. వాటితోనూ చాలా రకాల వంటలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆకులను పచ్చిగా నమిలినా కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాగా, ఈ వాము ఆకులతో మనం ఇంట్లోకి దోమలు రాకుండా ఆపొచ్చు. ఒక పింగాణి గిన్నె తీసుకొని అందులో ఈ ఆకులను ఉంచి  వాటిని కాల్చాలి.  ఆ పొగకు ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. ఇంట్లో దోమలు ఎటు నుంచి ఎక్కువగా వస్తూ ఉంటాయో.. అక్కడ పెడితే సరిపోతుంది. ఈ పొగ కారణంగా మన ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. దోమల బెడద కూడా ఉండదు.


ఇలా కాదు అంటే… మనకు ఇంట్లో వాము ఉంటుంది. కాబట్టి.. దానిని ఓ పిరికెడు తీసుకొని వేడినీటిలో వేయాలి. అలా వేడి నీటిలో నానపెడితే.. వాము రసం వస్తుంది. ఇప్పుడు ఆ నీటిని ఫిల్టర్ చేయాలి. ఆ తర్వాత.. ఫిల్టర్ చేసిన నీటిని మనం ఇల్లు తుడిచే సమయంలో… ఆ నీటిలో ఈ వాటర్ వేసి తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి సువాసన రావడమే కాకుండా.. దోమలను ఇంట్లోకి రాకుండా తిప్పికొట్టొచ్చు.

మీరు వాము ఆకులను నీటిలో మరిగించి చల్లార్చాలి. చల్లారిన తర్వాత ఆ నీటిని ఓ స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ నీటిని చేతులు, కాళ్లపై స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు బయటకు వెళ్లినా మనకు దోమలు కుట్టకుండా ఉంటాయి. వాటి వాసన దోమలకు నచ్చదు. కాబట్టి.. మన దగ్గరకు రాకుండా ఉంటాయి.

mosquito

వాము ఆకులను ఎండబెట్టి దిండులో పెట్టుకోవాలి. వార్మ్‌వుడ్ ఆకుల ప్రత్యేక వాసన క్రిమిసంహారక, క్రిమిసంహారక, దోమలను తిప్పికొట్టడం, నరాలను శాంతపరచడం, అలసటను తగ్గించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది పెద్దలు మరియు పిల్లలు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది.

కాఫీ గింజలతో… 

కాఫీ గింజలను పొడి చేసి, ఆపై ఓ ప్లేట్ లో పోయాలి కాఫీ వాసన ప్రతిచోటా వ్యాపించేలా ఇంటి మూలలో, మంచం కింద కాఫీ ఉంచండి. కాఫీ వాసనకు కూడా దోమలు రాకుండా ఉంటాయి.


ఇక ,చివరగా నిమ్మకాయతో కూడా దోమలను తరిమికొట్టచ్చు. నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ సుకోవాలి. కట్ చేసిన ముక్కకు లవంగాలు గుచ్చాలి. ఇలా చేసి ఇంట్లోని పలు మూలల్లో ఉంచితే.. ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

Latest Videos

click me!