నిఖిల్ పై యష్మి ఫీలింగ్స్ నిజమేనా.. ఎలిమినేట్ అయ్యాక అడ్డంగా దొరికిపోయిందిగా ?

First Published | Nov 25, 2024, 1:11 PM IST

మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ముగియబోతోంది. చివరి దశకు చేరుకునే కొద్దీ బిగ్ బాస్ పై ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

మరో మూడు వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ముగియబోతోంది. చివరి దశకు చేరుకునే కొద్దీ బిగ్ బాస్ పై ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్, గౌతమ్ టైటిల్ రేసులో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే వైల్డ్ కార్డు ద్వారా వెళ్లడం గౌతమ్ కి మైనస్ అని చెప్పొచ్చు. ప్రతి సీజన్ లో నెగిటివిటి మూటగట్టుకునే సెలెబ్రిటీలు కొందరు ఉంటారు. 

గత సీజన్ లో ఎక్కువ నెగిటివిటి తెచ్చుకున్న కంటెస్టెంట్ శోభా శెట్టి. ఈ సీజన్ లో అయితే ప్రతి ఒక్కరూ యష్మి అంటూ తడుముకోకుండా చెప్పేస్తున్నారు. యష్మి బలమైన కంటెస్టెంట్ అని చెప్పడంలో సందేహం లేదు. కానీ మరీ రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల నెగిటివిటి మూటగట్టుకుంది. ఆమె తండ్రి హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. 


బయట నెగిటివిటి ఎక్కువుగా ఉంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. అయినా యష్మి మారలేదు. దీనితో ఆమె ఎలిమినేట్ అయింది. యష్మి ఎలిమినేట్ అయ్యాక తొలిసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకి సపోర్ట్ చేసిన వారికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు చెప్పింది. మీ మద్దతు లేకుంటే తనకి కెరీర్ ఉండేది కాదని ఎమోషనల్ అయింది. 

ఇక బిగ్ బాస్ బజ్ లో అర్జున్ అంబటి దగ్గర అడ్డంగా దొరికిపోయింది. మీకు నిఖిల్ పై ఫీలింగ్స్ ఉన్నాయి కదా అని ప్రశ్నించాడు. ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మీరు నిజంగానే నిఖిల్ పై ఫీలింగ్స్ పెంచుకున్నారు. అతడిపై మీకు ఇష్టం ఉంది. నిఖిల్ ని రెచ్చగొట్టడానికే.. గౌతమ్ టీ షర్ట్ ధరించారు. నిఖిల్ జలసీ ఫీల్ కావాలనే అలా చేశారు కదా అని అర్జున్ ప్రశ్నించాడు. 

ఇక్కడ కూడా సరైన సమాధానం చెప్పలేక యష్మి దొరికిపోయింది. ఇప్పుడు నేను సిగ్గు పడుతూ సమాధానం చెబితే నిజంగా ఏదో ఊహించుకుంటారు. న గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అంటూ యష్మి సమాధానం ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసింది. 

Latest Videos

click me!