8,10 తరగతి అర్హతతో ఐదంకెల జీతం ఉద్యోగాలు ... తెలుగు యువత కోసమే స్పెషల్ రిక్రూట్ మెంట్

First Published | Nov 25, 2024, 12:36 PM IST

తెలంగాణ యువతకు అద్భుత అవకాశం. కేవలం 8, 10 తరగతి చదివినా చాలు ... వేల రూపాయల జీతం, లక్షల రూపాయల ఆర్థిక భరోసాతో ఉద్యోగాన్ని పొందవచ్చు. రిక్రూట్ మెంట్ వివరాలివిగో...

Indian Army Recruitment

Army Recruitment : తెలంగాణకు చెందిన నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. దేశానికి సేవ చేసుకుంటునే మంచి ఆదాయాన్ని, భవిష్యత్ కు మంచి భరోసా కల్పించే ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం వారి ముందుంది. పెద్దగా విద్యార్హతలు కూడా అవసరం లేదు. ఇలా తెలంగాణ యువతను ఇండియన్ ఆర్మీలో చేర్చుకునేందుకు హైదరాబాద్ లో రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డ్ ప్రకటించింది.

వచ్చే నెల డిసెంబర్ 8 నుండి 16వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి  స్టేడియంలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీలో రిక్రూట్ మెంట్ బోర్డ్ సూచించిన అన్ని అర్హతలు కలిగిన తెలంగాణ యువత పాల్గొనవచ్చు. సైన్యంలో చేరాలని కలలుగంటున్న యువతకు ఇది చక్కటి అవకాశం. 
 

Indian Army Recruitment

పోస్టుల వివరాలు : 
 
భారత ఆర్మీలో నిర్ణీత కాలవ్యవధి వరకు సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద జోరుగా నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని 33 జిల్లాల యువతకు అగ్రివీర్ స్కీం ద్వారా ఉద్యోగాలు కల్పించేందుకు ఆర్మీ రిక్రూట్ మెంట్ బోర్డ్ సిద్దమయ్యింది. 

కేవలం ఎనిమిది, పదో తరగతి విద్యార్హతలతో పలు పోస్టుల భర్తీ చేపడుతున్నారు. ఇలా అగ్నివీర్ జనరల్ డ్యూటీతో పాటు టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్ మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అగ్నివీర్ ట్రేడ్ మెన్ పోస్టుకు కేవలం ఎనిమిదో తరగతి పాసై వుంటే చాలు. మిగతా పోస్టులకు కనీసం పదో తరగతిలో ఉత్తీర్ణులై వుండాలి. 

అన్ని అర్హతలు కలిగిన యువత హైదరాబాద్ లో జరిగే అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అగ్నివీర్ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ... అన్నింటికీ అంగీకారంగా వుంటేనే రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనాలని అభ్యర్థులకు సూచించారు. 
 

Latest Videos


Indian Army Recruitment

ఏపీలో ముగిసిన అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ : 

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ముగిసింది. ఈ నెల నవంబర్ 10 నుండి 15వ తేదీ వరకు కడపలోని డిఎస్ఏ స్టేడియంలో ఈ ర్యాలీ జరిగింది. ఇందులో ఏపీలోని కడప, అన్నమయ్య, అనంతపురం, చిత్తూరు, నంద్యాల, తిరుపతి, ప్రకాశం, బాపట్ల,గుంటూరు, పల్నాడు,నెల్లూరు, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన యువతకు అవకాశం కల్పించారు. 

ఈ అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీలో 4 వేల మందికిపైగా పాల్గొన్నారు. వీరిలో రోజుకు 800 మంది చొప్పున స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. హైదరాబాద్ లో కూడా ఇలాగే అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ చేపట్టనున్నారు. 

Indian Army Recruitment

అసలు ఏమిటీ అగ్నివీర్? ఎంత జీతం వస్తుంది?

భారత సైన్యంలో తాత్కాలిక పద్దతిలో సైనికుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం  2022లో 'అగ్నిపథ్ స్కీమ్' ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద సైనికులను 4 సంవత్సరాల వ్యవధికి సైన్యంలో చేర్చుకుంటారు... అటువంటి సైనికులను 'అగ్నివర్స్' అని పిలుస్తారు. ఈ పథకం కింద సాయుధ దళాల్లో సైనికుల నియామకానికి 17.5 నుంచి 21 సంవత్సరాల వయస్సును నిర్ణయించారు. ఈ అగ్నిపథ్ పథకం ద్వారా ఇప్పటివరకు భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళంలో వేలాది మంది సైనికులను రిక్రూట్ చేసుకున్నారు.

అగ్నిపథ్ పథకం కింద రిక్రూట్ అయిన సైనికులకు ఉద్యోగం వచ్చిన మొదటి సంవత్సరంలో ప్రతి నెలా రూ.30 వేల జీతం లభిస్తుంది. ఇందులో వారికి రూ.21 వేలు చేతితో లభిస్తుంది. వేతనంలో 30 శాతం అంటే రూ .9 వేలు సేవా నిధిగా కట్ చేయబడతాయి. అగ్నివీర్స్ జీతం ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుతుంది.  అందులో 30 శాతం సర్వీస్ ఫండ్ గా కట్ చేయబడుతుంది.

వారి సర్వీస్ పీరియడ్ ముగిశాక ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచి చివరి నెల వరకు సర్వీస్ ఫండ్ గా కట్ చేసిన డబ్బును తిరిగి ఇస్తారు.జీతం నుండి కట్ చేసిన డబ్బులకు మరికొంత డబ్బులు ప్రభుత్వం కలిపి రెట్టింపు సొమ్ము ఇస్తుంది. ఇలా 4 సంవత్సరాల సర్వీస్ తర్వాత అగ్నివీర్లకు ఏకమొత్తంగా సుమారు 10 లక్షల రూపాయలు లభిస్తాయి. ఇక కొంతమందికి మరికొంతకాలం ఆర్మీలో కొనసాగే అవకాశం వుంటుంది. 
 

click me!