Latest Videos

భార్యభర్తలు ఎలా ఉండాలి..? సుధామూర్తి ఏం చెప్పారంటే..?

By ramya SridharFirst Published Jul 3, 2024, 5:11 PM IST
Highlights

భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే.. వారి మధ్య కచ్చితంగా గొడవలు జరగాలంట. అలా గొడవలు పడినప్పుడే వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందట. ఈ విషయాన్ని సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ప్రేమ లేకుండా ఏ బంధం నిలపడదు. ముఖ్యంగా దాంపత్య బంధంలో  ప్రేమ చాలా అవసరం. ప్రేమ ఉన్నప్పుడే వారు ఒకరితో మరొకరు ఆనందంగా జీవించగలరు. అయితే... భార్యభర్తలు సంతోషంగా ఉండాలంటే.. వారి మధ్య కచ్చితంగా గొడవలు జరగాలంట. అలా గొడవలు పడినప్పుడే వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందట. ఈ విషయాన్ని సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

సుధా మూర్తి రచయిత్రి, పార్లమెంటు సభ్యురాలు , ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్. ఆమె తెలివైన రచయిత్రి మాత్రమే కాదు, ఆమె ముక్కుసూటిగా మాట్లాడతారు అనే  పేరు కూడా ఉంది.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె రిలేష‌న్, భార్యాభ‌ర్తల అనుబంధం గురించి స‌మాచారం ఇచ్చారు. భార్యాభర్తలు గొడవపడాలని, ఎప్పుడూ గొడవపడకపోతే భార్యాభర్తలుగా ఉండలేమని సుధా మూర్తి అన్నారు. 

భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి సుధా మూర్తి మాట్లాడుతూ.. 'భార్యభర్తలైతే గొడవలు సహజం, అలా జరగాలి, ఎప్పుడూ గొడవలు పడలేదని చెబితే భార్యాభర్తలు కాలేరు. చిన్న చిన్న మనస్పర్థలు, గొడవల కారణంగా ప్రేమ పెరుగుతుంది కానీ తగ్గదు.

రెండవది - ఒకరు కోపంగా ఉంటే, మరొకరు చల్లగా ఉండాలి.
భార్యాభర్తలు పోట్లాడినప్పుడు ఒకరికి విసుగు వస్తుంది. అటువంటి పరిస్థితిలో, అవతలి వ్యక్తి చల్లగా ఉండాలి. మూర్తికి కోపం వచ్చినప్పుడు నేనెప్పుడూ మాట్లాడనని, మౌనంగా ఉంటానని ఆమె చెప్పారు. దీంతో గొడవలు త్వరగా ముగిసి కుటుంబమంతా అందంగా ఉంటుందని ఆమె అన్నారు.

ఇక సుధా మూర్తి చెప్పిన మూడో విషయం ఏమిటంటే లైఫ్ ఇజ్ అండ్ టేక్. ఇక్కడ ఎవరికీ పరిపూర్ణమైన జీవితం లేదు. అలాగే పరిపూర్ణ జంటలు కూడా లేరు. ఇద్దరిలో కొన్ని మంచి గుణాలు, కొన్ని చెడు లక్షణాలు ఉంటాయి. రెండింటినీ అర్థం చేసుకుంటేనే జీవితం బాగుంటుంది. భాగస్వామి మంచి అలవాట్లను అంగీకరించినట్లే, వారి చెడు లక్షణాలలో కొన్నింటిని అంగీకరించండి, వీలైతే వారు చాలా చెడ్డగా ఉంటే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి, కానీ వారుమీ లాగా మారిపోవాలని ఎప్పుడూ అనుకోకండి.


వంటగదిలో భర్త తన భార్యకు సహాయం చేయాలి
సుధా మూర్తి భార్యాభర్తలందరితో, 'ఈ తరంలోని ప్రతి మగవాడు తన భార్యకు వంటగదిలో సహాయం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఆమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఆమె కార్యాలయంలో పని చేస్తుంది, తరువాత ఇంటికి వచ్చి వంట చేస్తుంది, PTA సమావేశాలకు హాజరవుతుంది. దీంతో వారిపై మరింత భారం పడుతోంది. కాబట్టి భార్య భారంలో సగం భరించడం భర్తలు నేర్చుకోవాలి. అప్పుడే జీవితం బాగుంటుంది. వంట , ఇంటి పనిలో భార్యకు సహాయం చేయండి. దీంతో భార్యపై భారం తగ్గుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుందని అని ఆమె చెప్పారు.

click me!