బిగ్ బాస్ సీజన్ కి లవ్ బర్డ్స్ గా అవతరించారు పృథ్వి, విష్ణుప్రియ. ముఖ్యంగా విష్ణుప్రియ అతడు లేకపోతే బ్రతకలేను అన్నరీతిలో ప్రవర్తిస్తుంది. ఈ జంట 13వ వ వారం విడిపోవడం ఖాయమేనట. పృథ్వి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందట. లేని పక్షంలో తేజ ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. మరి చూడాలి ఈ అంచనాలు ఏ మేరకు నిజం అవుతాయో..
ఇక విన్నర్ రేసులో నిఖిల్, గౌతమ్ ఉన్నారట. వీరిలో ఒకరు టైటిల్ అందుకోనున్నారట. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే జరుగుతుంది. అయితే ఫస్ట్ వీక్ నుండి హౌస్లో ఉన్న నిఖిల్ కి అత్యధిక అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.