భార్యభర్తల మధ్య అనుబంధం బాగుండాలని అందరూ కోరుకుంటారు. కానీ.. కొన్నిసార్లు ఎవరికైనా పొరపాట్లు జరుగుతుంటాయి. చిన్న చిన్న తేడాలు, బేధాభిప్రాయలువస్తూనే ఉంటాయి. దాని వల్ల తెలీకుండా.. భార్య భర్తల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ఈ క్రమంలో శృంగారం లో కూడా గ్యాప్ పెరుగుతుంది. మరి ఆ పెరిగిన గ్యాప్ ని తగ్గించడమెలా..? మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఈ టిప్స్ తో.. మళ్లీ మీ భార్యకు దగ్గరవ్వండి.
దంపతుల మధ్య గ్యాప్ రావడం చాలా సహజం. అయితే.. దానిని శాశ్వతం చేసుకోకూడదు. కాబట్టి.. ప్రేమగా దగ్గరకు తెచ్చుకోవాలి. ముందుగా కౌగిలితో దగ్గరవ్వాలి. మాటలతో వీలుకాని పని కేవలం ఒక చిన్న స్పర్శతో మారిపోతుందట. కాబట్టి.. ఎన్నిసార్లు సారీ చెప్పినా కరగకపోతే.. ప్రేమగా... తాకడం హత్తుకోవడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే.. వారిలో మార్పు వస్తుంది.
పెళ్లైన కొత్తలో కాసేపు మాట్లాడకపోయినా.. ఏదో కోల్పోయినట్లు భావిస్తారు. అదే ఏళ్లు గడుస్తున్న కొద్దీ.. పెద్దగా పట్టించుకోరు. అలా కాకుండా.. ఎన్ని సంవత్సరాలు గడిచినా.. ప్రేమ తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గ్యాప్ వచ్చినప్పుడు.. ఒకరితో మరొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అప్పుడు దూరం తగ్గి.. దగ్గరౌతారు. కలయికను కూడా ఎక్కువగా ఎంజాయ్ చేయగలరు.
ఒక దంపతుల మధ్య గొడవ వచ్చినప్పుడు.. చాలా మంది తమ వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా పెద్దగా దృష్టి పెట్టరు. అలా చేయకూడదట. వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ఇద్దరూ కలిసి వాకింగ్ చేయడం.. లేదా వ్యాయామం చేయడం లాంటివి చేయడం మొదలుపెట్టాలి. ఇలా చేస్తే.. ఇద్దరి మధ్యా మళ్లీ కనెక్షన్ పెరుగుతుందట.
ఇక ఒకరిపై ఒకరికి ప్రేమ పెరగాలంటే.. ముద్దు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి.. ఒకరినొకరు ప్రేమగా తాకడంతోపాటు... ముద్దు పెట్టుుకోవడం కూడా చాలా ముఖ్యమట. అందుకే.. ముద్దు ని మాత్రం పక్కన పెట్టకూడదట.
ఇక వీకెండ్స్ లో ఎలాగూ ఖాళీగానే ఉంటారు కాబట్టి.. ఆ సమయంలో దంపతులు తమకంటూ సమయం కేటాయించుకోవాలి. మీ పార్ట్ నర్ కి ఏమి కావాలో అడిగి తెలుసుకోవాలి. అడిగి.. వారికి నచ్చినది చేయడం వల్ల ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది.