సెక్స్ లైఫ్ బోరింగా ఉందా? ఈ టిప్స్ తో మీ స్టామినా పెంచుకోండి

First Published | Oct 22, 2023, 10:56 AM IST

ప్రస్తుత కాలంలో చాలా మందికి చిన్న వయసులోనే లైంగిక కోరికలు తగ్గడం ప్రారంభించాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈ సమస్యల నుంచి గట్టెక్కొచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే? 
 

Foods for Stamina

సెక్స్ సమయంలో స్టామినా లేకపోవడం చికాకు, కోపం, ఒత్తిడి వంటి సమస్యలకు గురవుతారు. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడానికి, స్టామినాను మెరుగుపరచడానికి ఎన్నోప్రయత్నాలు చేస్తుంటారు. నిజానికి శరీరంలో జరిగే మార్పుల వల్లే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. జీవనశైలిలో మార్పులు, ఆలస్యంగా నిద్రలేవడం, శారీరక శ్రమ చేయకపోవడం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. మీకు కూడా సెక్స్ స్టామినా తక్కువగా ఉంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. 
 


స్టార్ట్ స్టాప్ టెక్నిక్

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యూరాలజీ ప్రకారం.. సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనాలంటే ఈ టెక్నిక్ ను ఉపయోగించండి. స్టార్ట్ స్టాప్ టెక్నిక్ అంటే స్ఖలనం సమీపించినప్పుడు లైంగిక చర్యను ఆపేయాలి. తర్వాత లోతుగా శ్వాస తీసుకోవాలి. తర్వాత మళ్లీ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. దీనిలో స్ఖలనాన్ని నివారించాల్సి ఉంటుంది. దీంతో శరీరంలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
 


కొత్త సెక్స్ పొజీషన్

శృంగారంలో కొత్తదనాన్ని ఆస్వాధించడానికి కొత్త భంగిమలను ట్రై చేయండి. ఇది లైంగిక జీవితంలో థ్రిల్ ను పెంచుతుంది. దీనికి తోడు అభిరుచి తగ్గడం కూడా పెరుగుతుంది. కొత్త లైంగిక అనుభవం కోసం మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన సంభాషన చేయండి. 
 

ఆడవారి శరీరంలోని చాలా భాగాలు లైంగిక కోరికలను పెంచుతాయి. వీటిని టచ్ చేయడం వల్ల లైంగిక అనుభూతి కలగడం మొదలవుతుంది. అలాగే రకరకాల ముద్దులను ట్రై చేయండి. ఇది భావప్రాప్తిని పెంచుతుంది. అంతేకాదు మీరు ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనడానికి కూడా సహాయడుతుంది. 
 

వ్యాయామం చాలా ముఖ్యం

వ్యాయామం మీ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడంతో పాటగా మీ సెక్స్ స్టామినాను కూడా పెంచుతుంది. వ్యాయామం నుంచి మీకు ఇష్టమైన ఆటలను కూడా ఆడొచ్చు.దీంతో ఆందోళన తగ్గుతుంది. దీంతో పాటుగా శరీరంలో రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ఇది సెక్స్ సమయంలో ఉద్వేగం, ప్రేరణకు సహాయపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలొచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. 

ధూమపానం 

సైన్స్ డైరెక్ట్ ప్రకారం.. స్మోకింగ్ ఆక్సీకరణ ఒత్తిడికి, అంగస్తంభనకు కారణమవుతుంది. దీనివల్ల సెక్స్ సమయంలో స్టామినా తగ్గుతుంది. అంతేకాదు లైంగిక వాంఛ కూడా తగ్గుతుంది. స్మోకింగ మానేస్తే గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 
 

Latest Videos

click me!