శారీరక కారకం
గుండె జబ్బులు, డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలు, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా లైంగిక కోరికలు కలగవు. అలాగే ప్రెగ్నెన్సీ, ప్రసవం తర్వాత అంటే యోని చాలా సాగదీయబడటం, కోతలు, కుట్లు ఉంటాయి. దీని వల్ల మహిళలకు సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. అలాగే తల్లి పాలిచ్చేటప్పుడు యోని మరింత పొడిగా మారుతుంది. దీనివల్ల సెక్సువల్ హార్మోన్ల అసమతుల్యత, లిబిడో లోపం వంటి సమస్యలు వస్తాయి. అలాగే రుతువిరతి కూడా లైంగిక కోరికలు తగ్గడానికి దారితీస్తుంది.