కొన్నేండ్లుగా పురుషుల భావప్రాప్తికే ప్రాధాన్యం లభిస్తోంది. నేటికీ కూడా చాలా మంది ఆడవారు తమ భాగస్వామితో లైంగిక ఉద్వేగం, సంతృప్తి గురించి మాట్లాడలేకపోతున్నారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు కూడా తమ ఉద్వేగం గ్యాప్ గురించి భాగస్వామితో ఖచ్చితంగా మాట్లాడాలి. పురుషులు మాత్రమే భావప్రాప్తిని పొందితే చాలానుకునే వారు చాలా మందే ఉన్నారు. చాలా మంది ఆడవారు తమ భావప్రాప్తికి సంబంధించిన విషయాలను అవసరమైతే తప్ప తెలుసుకోరు. సెక్స్ లో సంపూర్ణ ఆనందాన్ని పొందాలంటే మీ ఉద్వేగానికి సంబంధించిన విషయాలను, వాస్తవాలను మీ భాగస్వామికి చెప్పాలి. అలాగే మీ బోరింగ్ సెక్స్ జీవితాన్ని కొద్దిగా మసాలా యాడ్ చేయండి. స్త్రీ భావప్రాప్తికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
క్లిటోరస్
క్లిటోరస్ అత్యంత సున్నితమైన శరీర భాగాలలో ఒకటి. క్లిటోరస్ లో ఎన్నో నరాల చివరలు ఉంటాయి. అందుకే ఇది ఆనందానికి శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. అందుకే చాలా మంది మహిళలు క్లిటోరిస్ ద్వారా భావప్రాప్తిని పొందుతారు. జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ 2018 అధ్యయనం ప్రకారం.. 36% మంది మహిళలు క్లిటోరస్ ఉద్దీపన నుంచి ఉద్వేగానికి చేరుకుంటారు. అలాగే 18% మంది మహిళలు పురుషాంగం ప్రవేశం ద్వారా మాత్రమే భావప్రాప్తి పొందారు. మెజారిటీ గురించి మాట్లాడితే.. చాలా మంది మహిళలు క్లెటోరస్ లేకుండా భావప్రాప్తికి చేరుకోవడం కష్టం.
మహిళల్లో బహుళ భావప్రాప్తి
సాధారణంగా మగవారు ఉద్వేగానికి చేరుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయాలి. కానీ మహిళల విషయంలో ఇలా జరగదు. వారు ఒకే రౌండ్లో ఎన్నో సార్లు భావప్రాప్తిని పొందుతారు. జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ నిర్వహించిన 2016 అధ్యయనంలో.. 18, 70 సంవత్సరాల మధ్య వయస్సున్న 2,049 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 8% మంది ఆడవారు ఎన్నో సార్లు భావప్రాప్తిని పొందారు. మరొక అధ్యయనంలో.. 800 మంది కళాశాల గ్రాడ్యుయేట్ మహిళా విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో 43% మంది మహిళలు బహుళ భావప్రాప్తిని పొందారు.
భావప్రాప్తిని వివిధ శృంగార ప్రాంతాల నుంచి పొందొచ్చు
లైంగిక ఆనందాన్ని పొందడానికి మీకు సహాయపడే శృంగార ఉత్తేజపరిచే ప్రాంతాలు శరీరంలో ఎన్నో ఉన్నాయి. ఇవి మీ ఉత్సాహాన్ని కూడా పెంచుతాయి. చనుమొనలు, క్లిటోరస్, తొడలు, బ్యూటాక్స్, పొత్తికడుపు దిగువ భాగం, వీపు మొదలైనవి మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తాయి. కానీ భావప్రాప్తి పొందడానికి చనుమొనలు సాధారణంగా అవసరం. మహిళలు తమ శరీర సామర్థ్యాన్ని బట్టి భావప్రాప్తి పొందడానికి వివిధ శృంగార ప్రాంతాలను ప్రేరేపిస్తారు. అయితే క్లిటోరస్ లేదా చొచ్చుకుపోవడం నుంచి ఉద్వేగం చేరుకోవడం కష్టమైతే మీరు చనుమొనలను ప్రయత్నించొచ్చు.
నిద్రపోతున్నప్పుడు కూడా భావప్రాప్తి పొందొచ్చు
జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ ప్రకారం.. కొన్నిసార్లు క్లిటోరిస్, ఇతర శృంగార ప్రాంతాన్ని ప్రేరేపించకుండానే ఆడవారు భావప్రాప్తి పొందొచ్చు. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు భావప్రాప్తిని పొందుతారు. చాలాసార్లు మనం కలలు కంటుంటాం. దీని వల్ల ప్రైవేట్ భాగాల్లో రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో మనం నిద్ర ఉద్వేగానికి చేరుకుంటాం. 2012 లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. కడుపుపై నిద్రపోయే వ్యక్తులు ఎక్కువ లైంగిక అనుభూతిని, నిద్ర ఉద్వేగాన్ని అనుభవిస్తారు.
జన్యుపరమైనది కావొచ్చు
జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ ప్రకారం.. ఉద్వేగాన్ని సాధించే మీ సామర్థ్యంలో 60% వరకు జెనెటిక్స్ అంటే డీఎన్ఏ బాధ్యత వహిస్తుంది. సంభోగం సమయంలో మీ క్లిటోరిస్, మూత్రాశయం మధ్య దూరం ఉద్వేగం పరిధిని నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ క్లిటోరిస్, మూత్రాశయం మధ్య 2.5 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం ఉంటే సంభోగంలో మీరు భావప్రాప్తిని తొందరగా పొందుతారు.
భావప్రాప్తి పొందడానికి చాలా సమయం పడుతుంది
పరిశోధనల ప్రకారం.. మహిళలు సెక్స్ లో పాల్గొన్నప్పుడు భావప్రాప్తిని పొందడానికి 6 నుంచి 20 నిమిషాలు పడుతుంది. సగటున 14 నిమిషాలు పడుతుంది. అలాగే యోని సెక్స్ లో పురుషులు భావప్రాప్తిని పొందడానికి 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. అయితే భాగస్వామితో సెక్స్ లో పాల్గొనప్పుడు మహిళలు భావప్రాప్తికి చేరుకోవడంలో ఆలస్యం చేస్తారు. ఎందుకంటే పురుషులు మహిళల భావప్రాప్తి ప్రాంతాన్ని గుర్తించరు. దీనివల్లే ఆడవారు భావప్రాప్తిని తొందరగా పొందరు. అందుకే ఈ విషయం గురించి భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి.