పిల్లలు ఉన్న ఇళ్లు.. దేవాలయంతో సమానం అని పెద్దలు చెబుతుంటారు. వారి బోసి నవ్వులు, బుడి బుడి అడుగులను చూసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. పెళ్లైన ప్రతి దంపతులు కూడా తమ జీవితంలోకి ఓ చిన్నారి అడుగుపెడితే బాగుండని కోరుకుంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులకు సంతాన భాగ్యం లభించడం లేదు. దీంతో... సంతానం కోసం ఆస్పత్రుల చుట్టే తిరిగేస్తూ ఉంటారు.
undefined
పిల్లలు పుట్టడం లేదు.. ఆస్పత్రికి వెళ్లాలి అనుకోగానే.. ముందు అమ్మాయిలోనే లోపం ఉందనే అనుమానపడతారు. ఇదొక్కటే కాదు.. పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఇవే నంటూ.. చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. ముందు వాటిని తొలగించుకునే ప్రయత్నం చేద్దాం.
undefined
చాలా మంది ఫెర్టిలిటీ సమస్య రాగానే.. అది కేవలం అమ్మాయిలలో మాత్రమే లోపం అని భావిస్తుంటారు. అయితే... అది పురుషుల్లోనూ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఇద్దరిలో ఎవరిలో సమస్య ఉన్నా.. పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. కాబట్టి.. ముందు సమస్య ఎవరిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత దానికి తగినట్లు చికిత్స తీసుకోవాలి.
undefined
పిల్లలు పుట్టకపోతే.. సంసారం సరిగా సాగడం లేదని చాలా మంది భావిస్తుంటారు. ఈ భావనను సదరు దంపతులపై నెట్టే అవకాశం ఉంది. ఆ ప్రభావం వారిపై పడినా కూడా.. సమస్యల మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి సమస్య వస్తే.. ఇక జీవితంలో పిల్లలు పుట్టరనే భావనను ముందుగా తొలగించుకోవాలి. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే నమ్మకం ఉండాలి.
undefined
తొలి సంతానం కలిగిన తర్వాత.. ఇక వారిలో ఫెర్టిలిటీ సమస్యలు లేవు.. ఇక రావు అని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే.. అందులో ఎలాంటి వాస్తవం లేదు. తొలి సంతానం కలిగిన తర్వాత .. రెండో సంతానం విషయంలో సమస్యలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. తొలి సంతానం తర్వాత కూడా 30శాతం మందిలో ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉందట.
undefined
లైఫ్ స్టైల్ కారణంగానే ఫెర్టిలిటీ సమస్యలు రావడం.. మద్యం సేవించడం, స్మోకింగ్ తాగడం లాంటివి చేసేవారిలో మాత్రమే.. ఈ ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయనడంలో ఎలాంటి వాస్తవం లేదు. అయితే.. ఆరోగ్యకరమైన ఆహారం, దురలవాట్లు లేని వారిలో మాత్రం ఈ సమస్య కాస్త తక్కువగా ఉంటుందనేది నిజం. ఎవరిలో అయినా.. ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది.
undefined
ఫెర్టిలిటీకి మందులు.. చాలా మంది పిల్లలు పుట్టకపోతే.. కొన్ని రకాల మందులు, ఆయుర్వేదం, హెర్బల్స్ తీసుకోవడం వల్ల వెంటనే పిల్లలు పుడతారని అనుకుంటారు. అయితే.. ఇవన్నీ నమ్మకుండా.. వైద్యులను సంప్రదిస్తే.. సరైన చికిత్స అందించి.. మీ సమస్యను పరిష్కరిస్తారు.
undefined