పెళ్లైన కొత్తలో చాలా సరదాగా ఉంటుంది. చాలా మంది తమ భార్యలను కాసేపు కూడా వదిలిపెట్టరు. ముఖ్యంగా హనీమూన్ లో రెచ్చిపోతారు. మరీ ముఖ్యంగా శృంగారం విషయంలో ఎప్పుడూ అదే ధ్యాస ఉంటుంది. కానీ.. కొంతకాలం తర్వాత ఎందుకో తెలీదు.. పెద్దగా ఇంట్రస్ట్ ఉండదు. అయితే.. అలా ఆసక్తి పోవడానికి గల కారణాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం..
undefined
దంపతులు ఇద్దరికీ సెక్స్ విషయంలో ఒకేలాంటి ఆలోచన ఉండాలని రూలేమీ లేదు. ఒకొకరికి ఎక్కువ కోరికలు ఉండొచ్చు. మరొకరికీ తక్కువగా ఉండొచ్చు. అయితే.. దాని వల్ల పడక గదిలో సమస్య ఏర్పడితే మాత్రం పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిన్తున్నారు. ఒకరికొరు శారీరకంగా దగ్గరగా లేకపోవడం.. మనసు విప్పి మాట్లాడుకోకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య ఎదుర్కౌతుందట. కాబట్టి.. ముందు ఆ దూరం తగ్గించుకుంటే.. ఈ సమస్య తగ్గుతుందట.
undefined
చాలా మంది మహిళలకు పిల్లల పుట్టిన తర్వాత చాలా ఒత్తిడికి గురౌతారట. కాబట్టి.. ఆ సమయంలో వారికి సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. అంతేకాక.. మోనోపాజ్ దశ కి చేరుకున్న మహిళల్లోనూ సెక్స్ కోరికలు తగ్గిపోతాయట.
undefined
ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా.. సెక్స్ లైఫ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేరట. అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్న పురుషులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. అంతేకాదు డిప్రెషన్ తో ఎక్కువగా బాధపడేవారు సైతం ఈ రకం సమస్యలను ఎదుర్కొంటున్నారట.
undefined
ఇవన్నీ కాకపోయినా.. పడకగదిలోకి వెళ్లిన తర్వాత మూడ్ రావడం లేదు అంటే.. వారి మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
undefined
కాబట్టి.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలి. దంపతుల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది ఇదే అన్న విషయం అర్థం చేసుకోవాలి.
undefined
కొందరికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి అలవాటు ఉన్నవారు కూడా సెక్స్ ని ఎంజాయ్ చేయలేరట. కాబట్టి.. ఈ అలవాటు ను తగ్గించుకోవాలి. ఈ మార్పులు చేసుకుంటే.. సెక్స్ లైఫ్ ని ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చట.
undefined