Relationship: సెక్స్ లైఫ్ బోర్ కొడుతుందా..? ఈ విషయం పార్ట్ నర్ కి చెప్పేదెలా?

First Published | Aug 9, 2022, 1:53 PM IST

కొందరికి.. ఒకే పొజిషన్ లో ఒకే గదిలో రోజూ కలయికలో పాల్గొనడం వల్ల.. అది బోర్ అనిపించవచ్చు. అయితే..  ఆ బోర్ పోగొట్టుకోవడానికి కేవలం పార్ట్ నర్ తో మాట్లాడితే సరిపోతుంది. ఆ విషయం తెలియక చాలా మంది తప్పు చేస్తుంటారు

sex

శృంగారంపై ఆసక్తి అందరికీ ఉంటుంది. కొందరికి అయితే.. ఆ పేరు వినగానే నరాలు జువ్వుమంటాయి కూడా. వెంటనే కోరికలు కలిగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇంత ఉత్సాహం.. పోను పోను ఉండదు అనేది కొందరి అభిప్రాయం. పెళ్లి అయిన కొత్తలో ఉన్న ఈ ఆత్రం.. తర్వాతర్వాత తగ్గిపోతుందని కొందరు చెబుతూ ఉంటారు. అందులోనూ నిజం లేకపోలేదు. కొందరికి.. ఒకే పొజిషన్ లో ఒకే గదిలో రోజూ కలయికలో పాల్గొనడం వల్ల.. అది బోర్ అనిపించవచ్చు. అయితే..  ఆ బోర్ పోగొట్టుకోవడానికి కేవలం పార్ట్ నర్ తో మాట్లాడితే సరిపోతుంది. ఆ విషయం తెలియక చాలా మంది తప్పు చేస్తుంటారు. అయితే.. ఈ విషయాన్ని చెప్పే విధంగా చెబితేనే మీ పార్ట్ నర్ అర్థం చేసుకుంటారట. మరి పార్ట్ నర్ ఎలా చెప్పాలో ఓసారి తెలుసుకుందామా...

sex

మీ లైంగిక జీవితం గురించిన చర్చలను తేలికగా తీసుకోకూడదు. మీరు ఆ టాపిక్ ని మీ జీవిత భాగస్వామి ముందుకు తీసుకురావడానికి సరైన అవకాశం లేదా సరైన స్థలం కోసం వేచి ఉండాలి. ఈ విషయంలో తొందరపడి మాట్లాడకూడదు. సమయం చూసుకొని నెమ్మదిగా చెప్పాలి.

Latest Videos


sex

మీ భర్త వేర్వేరు సెక్స్ పొజిషన్‌లను ప్రయత్నించడం మీకు సౌకర్యంగా ఉండకపోవచ్చు లేదా ఏదైనా ఇతర సమస్యను ఎదుర్కోవచ్చు. కాబట్టి, మీరు దీని గురించి ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. కాబట్టి.. మీకు ఎలా అయితే నచ్చుతుందో.. ఏది నచ్చడంలేదో.. ఏది కిక్ ఇస్తుందో.. ఏది బాధిస్తుందో.. వారికి చెప్పాలి. అప్పుడు వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

sex

మీరు ఈ సంభాషణతో ముందుకు వెళ్లే ముందు, మీ భాగస్వామి ఎలా స్పందించవచ్చో ఆలోచించండి. వారికి కోపం వస్తుందా, విసుగు చెందుతారా లేదా అన్నింటితో అర్థం చేసుకుంటారా? ఈ విషయాలన్నీ ఆలోచించాలి. ఆలోచించిన తర్వాతే దాని తర్వాతి పరిణామాల గురించి మీరు ముందూ ఊహించి.. ఆ తర్వాతే మీరే వారితో మాట్లాడాలి.

మీరు చెప్పేది మీ భాగస్వామిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి, మీరు ఈ సంభాషణను ఎలా అమలులోకి తీసుకువస్తారో మీరు నిజంగా జాగ్రత్తగా ఉండాలి. మీ కోరికలు, అవసరాలను సాధ్యమైనంత సౌకర్యవంతమైన రీతిలో వ్యక్తపరచండి. మీరు ఉపయోగించే పదాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

sex

మీరు మీ కోరికల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ భాగస్వామికి నచ్చిన వాటి గురించి అడగండి. మీ కోరికలతో పాటు వారి కోరికలను కూడా వ్యక్తపరచమని వారిని అడగండి. మీరు రెండు వైపుల నుండి స్పష్టమైన సంభాషణను ఉంచినప్పుడు, అటువంటి సున్నితమైన అంశం గురించి మాట్లాడటం సులభం అవుతుంది.

sex

మీ భాగస్వామితో మాట్లాడటం గురించి మీరు భయాందోళనలకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది భయానకంగా ఉండవచ్చు కానీ మీరు మీ వైవాహిక జీవితం, లైంగిక జీవితం తిరిగి ట్రాక్‌లోకి రావాలంటే మీరిద్దరూ చేయాల్సిన సంభాషణ చాలా అవసరం , ఇది వివాహాన్ని కొనసాగించడానికి చాలా అవసరం.

click me!