ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తున్నాడా.. నిజంగా ప్రేమిస్తున్నాడా అనేది తెలుసుకోవడం ఎలా?

First Published | Nov 28, 2021, 1:48 PM IST

 ప్రేమలో మోసపోయిన ప్రేమికులు వారి ప్రేమను మర్చిపోలేక మనసుకు తగిలిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలా కాకూడదనుకుంటే మీరు ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా మోసం చేస్తున్నారా అనే ఈ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో ప్రేమికుల సలహాలతో సరైన అవగాహన (Awareness) కలిగించడమే ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశ్యం.
 

ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు మొదట వారి ప్రేమలో (Love) ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా కొనసాగుతుంటుంది. ఇద్దరూ ఒకరికి ఒకరు లేకపోతే బ్రతకలేమన్నంత దూరం వరకు పోతుంది. కానీ అనుకోకుండా ఉన్నట్టుండి ఈ ప్రేమలో ఆటంకాలెదురవుతాయి. ఇందులో ఒకరిది స్వచ్ఛమైన ప్రేమ అయితే మరొకరిది స్వార్థంతో (Selfishly) కూడిన ప్రేమ ఉంటుంది. స్వార్థంతో కూడిన ప్రేమ కారణంగా వారి అవసరాలను తీర్చుకొని ప్రేమించిన వ్యక్తిని మోసం చేసి ఇతరులతో సంబంధం పెట్టుకుంటారు.
 

ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరికి గౌరవం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, ప్రత్యేక శ్రద్ధ ఉంటాయి. ప్రేమించిన వ్యక్తి మోసం (Cheating) ఇస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి అనేక దారులు ఉన్నాయి. మీ కష్టాలను తెలియపరిచినప్పుడు వారి మొహంలో చికాకు (Irritation) కనిపిస్తే వారు మిమ్మల్ని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. వారికి మీ కష్టాలతో పని లేదని వారి ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని తెలుసుకోవాలి.


మీరు ప్రేమించిన వ్యక్తికి ఫోన్ కానీ, మెసేజ్ కానీ చేసినప్పుడు రిప్లై (Reply) రాకపోతే వారు మీ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. మొదట ప్రేమలో ఉన్నప్పుడు చూపించే శ్రద్ధ ఇప్పుడు కనపడకపోవడానికి కారణం వారికి మీతో అవసరం తీరిపోయిందని, వారి ప్రయోజనాల (Benefits) కొరకు మాత్రమే ప్రేమించాలని అర్థం.
 

మీరు చేసే ప్రతి చిన్న పనిని ప్రోత్సహిస్తూ (Encouraging) అన్నింటిలోనూ విజయం కలిగేందుకు ప్రయత్నిస్తారు. మీ గెలుపులను తన గెలుపుగా భావించి సంతోషిస్తారు. అలా కాదని మీ విజయాలను చూసి ఓర్వ లేకపోతే వారిది స్వార్ధంతో కూడిన ప్రేమ. మీతో అవసరం తీరిపోయాక ఇతరులతో సంబంధం పెట్టుకున్నప్పుడు మునుపటిలా మీ పై శ్రద్ధ (Attention) తీసుకోవటం తగ్గిపోతుంది. 

మీరు ప్రశాంతంగా ఒకచోట కలుద్దామని ఫోన్ చేసినప్పుడు మీతో కలవడానికి ఇష్టపడక అనేక కారణాలు చెబుతారు. తన ఫ్రెండ్స్ కి మీ ప్రేమ గురించి తెలియపరచడానికి ఇష్టపడరు. మీ మధ్య ఏ చిన్న గొడవ జరిగినా దాన్ని పెద్దదిగా చేసి మీ బంధాన్ని (Bonding) దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తిరిగి మీ బంధాన్ని బలపరచడానికి తన వంతు ప్రయత్నం చేయరు. మీ నుంచి ఆర్థిక ప్రయోజనాలను (Financial benefits) పొందడం కోసమే కలవడానికి ఇష్టపడతారు.
 

మీరు తనతో ఉన్నప్పుడు మునుపటిలా తీసుకునే కేరింగ్ (Caring) తగ్గుతుంది. ఇతరులతో కొత్త సంబంధాల కారణంగా మీతో సమయాన్ని గడపడానికి ఇష్టపడరు. మీరు కనపడకపోతే ఫోన్ చేయరు మీ గురించి పట్టనట్లు ఉంటారు. ఈ విధమైన లక్షణాలు (Features) మీరు ప్రేమించిన వ్యక్తిలో ఉంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు అర్థం. తను టైం పాస్ కోసం, తన అవసరాల కోసం ప్రేమిస్తున్నాడని తెలుసుకొని వారి ప్రేమకు దూరంగా ఉండాలి.

Latest Videos

click me!