శృంగారంలో ఆందోళన.. తగ్గించుకోవడమెలా..?

First Published | Sep 30, 2021, 1:13 PM IST

తమ లైఫఫ్ పార్ట్ నర్ ని సుఖ పెట్టలేమనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించి లేని పోని ఒత్తిడి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరు తమ పురుషాంగం చిన్నగా ఉందని.. దానితో సెక్స్ ని ఆస్వాదించలేమని అనుకుంటూ ఉంటారు. 

మనలో చాలా మందికి రొమాన్స్ అంటేనే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. ముఖ్యంగా యవ్వనంలో ఉండే వారు ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు.సరిగ్గా సమయం వచ్చేసరికి టెన్షన్ పడుతుంటారు. వారికి తెలియకుండా ఒత్తిడికి గురవుతుంటారు. పార్ట్ నర్ సహకరిస్తుందా లేదా అని ఆందోళన చెందుతారు. తాము పార్ట్ నర్ ని సంతోష పెట్టగలమా లేదా అని కూడా కంగారుపడుతుంటారు


ఇది చాలా మందిలో ఉండే ఆందోళనేనట. దాని గురించి కంగారుపడాల్సిన అవసరం లేదు కానీ.. దానిని తగ్గించుకునే ప్రయత్నం మాత్రం  కచ్చితంగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos


ఆందోళన ఎక్కువగా పెరిగిపోతే.. అంగస్తంభన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీనంతటికీ  ఒత్తిడి కారణం అవుతుందట.  ముఖ్యంగా.. తమ లైఫఫ్ పార్ట్ నర్ ని సుఖ పెట్టలేమనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించి లేని పోని ఒత్తిడి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకొందరు తమ పురుషాంగం చిన్నగా ఉందని.. దానితో సెక్స్ ని ఆస్వాదించలేమని అనుకుంటూ ఉంటారు. 
 

అలా ఒత్తిడిగా అనిపించినప్పుడు 10 సెకన్లు విరామం తీసుకోవాలట. వచ్చే ఆలోచనలకు బ్రేక్ వేయాలి. ఆ తర్వాత  సెక్స్ గురించి ఆలోచిస్తే.. ఈ ఆందోళన నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఆందోళనతో బాధపడేవారు  ముందుగా కార్యంలోకి వెళ్లకుండా భాగస్వామితో మాట్లాడాలి. రోమాంటిక్ గా ఎక్కువ సేపు గడపాల్సి ఉంటుంది.. కొద్దిసేపు ప్రేమ కురిపించాలి. ఆమె చేరువయ్యాక.. ఫ్రీగా మారాక ఆ కార్యం మొదలుపెట్టాలని సూచిస్తున్నారు.

ఇక మీ పార్ట్ నర్ ఒత్తిడితో బాధపడుతుంటే.. మీరు మీ ప్రేమ, డ్రెస్సింగ్ తో వారి మనసు మార్చే ప్రయత్నం చేయవచ్చట .  సెక్సీగా వారికి నచ్చేలా తయారై  వారిని మెప్పించే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.  ఎక్కువగా లోదుస్తులపై ఫోకస్ పెట్టండి.భాగస్వామికి ఏ విధంగా చేస్తుందో నచ్చుతుందో గమనించి ఫోర్ ప్లే చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ఇక భాగస్వామిని శృంగారంలో రెచ్చగొట్టాలంటే ఒకరినొకరు తాకుతూ.. కిస్ చేసుకోవడం.. కౌగిలింతలు పెట్టుకోవడం వంటివి చేస్తే కలయికలో పాల్గొనే కార్యంలో ఆనందం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

అంతేకాదు.. వ్యాయామంపై ఎక్కువగా దృష్టిపెట్టాలట. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి.. యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. లేదా ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. ఇవన్నీ క్రమం తప్పకుండా చేయడం వల్ల.. ఈ ఆందోళన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
 

click me!