అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' నుంచి దేవిశ్రీప్రసాద్ అవుట్.. దెబ్బ మీద దెబ్బ, కారణం ఇదే

First Published | Nov 24, 2024, 1:54 PM IST

ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్ తప్పుకోవడం సంచలనంగా మారుతుంది. 

గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి దేవిశ్రీప్రసాద్ ఔట్

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకిగానూ ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. 'పుష్ప 2' కి కూడా మ్యూజిక్ చేయాల్సింది ఆయనే. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు. దాంతో తమన్, సామ్ CSలు మ్యూజిక్ చేస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ దేవిశ్రీప్రసాద్ కి మంచి పేరుంది. సూర్య 'కంగువ'కి ఆయనే మ్యూజిక్ చేశారు. కానీ ఆ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగోలేదని విమర్శలు వచ్చాయి. దాంతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఛాన్స్ ఆయనకి దక్కలేదని టాక్.


పుష్ప 2 దేవిశ్రీప్రసాద్

'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాకి డీఎస్పీ తప్పుకోవడంతో ఆయన స్థానంలో అనిరుధ్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దేవిశ్రీప్రసాద్ పాటలు కాపీ కొడుతున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.  పలు మార్లు ట్రోల్స్ కూడా అయ్యాయి. `వాల్తేర్‌ వీరయ్య`లో పూనకాలు లోడింగ్‌` పాట కాపీ అనే రూమర్స్ వస్తున్నాయి.  

గుడ్ బ్యాడ్ అగ్లీ మ్యూజిక్ డైరెక్టర్ మారాడు

ఆ పాటనే 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో 'సంభవం  లోడింగ్' అని కాపీ కొట్టేశారట. దాంతో ఆదిక్ రవిచంద్రన్ ఆయన్ని సినిమా నుంచి తప్పించారని టాక్. నిజానికి ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం వెయిట్‌ చేయాలి. ప్రస్తుతం అనిరుధ్ తో మాట్లాడుతున్నారట. ఆయన డేట్స్ దొరుకుతాయా అనేది చూడాలి. కానీ డీఎస్పీకి ఇలా జరగడం, ఆయన్ని సినిమా నుంచి తీసేయడం  టాలీవుడ్‌లో దుమారం రేపుతుంది. పైగా `పుష్ప 2` నుంచి తప్పించారనే వార్త కూడా పెద్ద రచ్చ అవుతుంది. 

read more: మూడుసార్లు పెళ్లి చేసుకున్న ఈ వివాదాస్పద హీరోయిన్‌ని గుర్తు పట్టారా? చిన్ననాటి రేర్‌ ఫోటోలు

also read: ఎన్టీఆర్‌ బాగా ఇష్టపడ్డ పాత్ర ఏంటో తెలుసా? ఎస్వీఆర్‌పై జెలసీతో మళ్లీ చేయాలనుకున్నా, ఆ కోరిక తీరకుండానే

Latest Videos

click me!