వీకెండ్ బోర్ కొడుతోందా..? ఇలా ఎంజాయ్ చేయండి..!

First Published | Jul 6, 2021, 12:09 PM IST

దాదాపు వారమంతా... ఆఫీసు పనులతో బిజీగా గడుపుతుంటారు. కాబట్టి.. వీకెండ్ మాత్రం కచ్చితంగా ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి.

చాలా మంది వీకెండ్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. స్నేహితులతో సరదాగా గడపాలని అనుకుంటారు. వర్క్ టెన్షన్ ఉండదు కాబట్టి.. విశ్రాంతి దొరుకుతుంది కాబట్టి.. ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కానీ.. ఎలా ఎంజాయ్ చేయాలో మాత్రం తెలీక తికమకపడుతుంటారు.
undefined
మరీ ముఖ్యంగా... దంపతులు.. తమకు దొరికిన ఈ ఫ్రీ టైమ్ ని ఎలా గడపాలో తెలియక టైమ్ వేస్ట్ చేసుకుంటారు. మరి ఎలా ఎంజాయ్ చేయాలో ఇప్పుడు చూద్దాం..
undefined

Latest Videos


దాదాపు వారమంతా... ఆఫీసు పనులతో బిజీగా గడుపుతుంటారు. కాబట్టి.. వీకెండ్ మాత్రం కచ్చితంగా ఒకరికోసం మరొకరు సమయం కేటాయించుకోవాలి. సరదాగా గడిపితీరాలి. ఇద్దరూ ఏకాంతంగా కూర్చొని మనసువిప్పి మాట్లాడుకోవాలి.
undefined
ఎంజాయ్ చేయడమంటే.. కేవలం బయటకు వెళ్లి భోజనం చేయడం మాత్రమే కాదు.. ఇద్దరూ కలిసి వంట చేసుకొని తినడం కూడా బాగుంటుంది. అలా కాదంటే.. మీకు నచ్చిన ఏదైనా పనిని ఇద్దరూ కలిసి చేయడం వల్ల కూడా చాలా సరదాగా ఉంటుంది.
undefined
ఇప్పుడిప్పుడు కరోనా నుంచి బయటపడి.. లాక్ డౌన్ బాధ కూడా తగ్గుతోంది కాబట్టి... ఏదైనా ప్లేస్ కి ట్రిప్ కి వెళితే బాగుంటుంది. అక్కడ ఇద్దరూ సరదాగా గడపితే ఇంకా బాగుంటుంది.
undefined
అంతేకాదు.. గ్రాసరీ షాపింగ్ బిల్స్, లాండరీ లాంటి వాటికి ఎంత ఖర్చు అవుతోంది.. అనే విషయంలో క్లారిటీగా మాట్లాడుకోవాలి. అంతేకాదు.. తర్వాత వచ్చే వారంలో ఏం చేయాలనే విషయంలోనూ క్లారిటీ తెచ్చుకుంటే బాగుంటుంుది. ఎక్కడికి వెళ్లాలి..? ఎలా గడపాలి..? ఇద్దరి పర్సనల్ అభిప్రాయాలు అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది.
undefined
అలా కాకుండా.. మీ పార్ట్ నర్ కి కాసేపు ఏకాంత సమయం కావాలని కోరుకుంటే.. అది కల్పించే బాధ్యత కూడా మీ పైనే ఉంటుంది. కాసేపు వారికి కావాల్సిన సమయాన్ని వారికి ఇచ్చి... తర్వాత మీతో గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. ఆ సమయంలో పిల్లల బాధ్యతను కూడా మరవకూడదు.
undefined
ఇక వీకెండ్ సమయంలో.. కచ్చితంగా ఫోన్లు వాడకూడదు అని రూల్ పెట్టుకోవాలి. ఆ ఫోన్లను దూరంగా పెట్టి.. ఉన్నా సమయాన్ని సంతోషంగా గడపాలి.
undefined
రాత్రిపూట డేట్ కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. పడక గదిని మరింత అందంగా మార్చుకుంటే.. సెక్స్ లైఫ్ ని కొత్తగా ఆస్వాదించవచ్చు.
undefined
గత వారం మీ మధ్య ఏవైనా గొడవలు వస్తే.. వాటి గురించి చర్చించుకోకపోవడం కరెక్ట్ కాదు.. ఒకవేళ మాట్లాడుకున్నా.. దానికి పరిష్కారమై ఉండేలా చూసుకోవాలి.
undefined
ఇప్పుడు ఓటీటీల్లో చాలా కొత్త సినిమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి.. వాటిని ఇద్దరూ కలిసి సరదాగా చూడటం చేయవచ్చు. సినిమా కాకపోతే.. వెబ్ సిరీస్ అయినా చూడొచ్చు.
undefined
click me!