శృంగారం ఎంత తియ్యటి భావనో... అంత కష్టమైన పని.. స్వర్గసుఖాలను అనుభవించాలంటే ముందుగా మానసికంగా, శారీరకంగా సిద్ధమవ్వాలి. ముఖ్యంగా మీ భాగస్వామిని మెప్పించలేనేమో అనే అనుమానం అస్సలు మనసులోకి రానివ్వదు. అది కనక ఒక్కసారి వచ్చిందా.. అంతే మిమ్మల్ని యాంగ్జైటీలోకి నెట్టేస్తుంది.
ఈ లైంగికాందోళనకు అనేక కారణాలుంటాయి. ఒత్తిడి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంతకుముందు ఏదైనా ఇబ్బందులు రావడం ఇలాంటివి ఏవైనా కావచ్చు. అవి మీ లైంగిక జీవితాన్ని పడకగదిలో మీ సామర్థ్యాన్ని ఛాలెంజ్ చేస్తాయి.
దీంతో శృంగార కోరికలు అణచబడతాయి, లైంగిక హార్మోన్ల పనితీరు ప్రభావితం అవుతుంది. దీనికోసం హార్మోన్ ఇంజక్షన్స్, మందులు వాడాల్సి వస్తుంది. అంత దాకా వెళ్లకుండా సహజపద్ధతుల్లో మ యాంగ్జైటీని తొలగించుకునే మార్గాలు ఇవి.
మీలోని ఆ సామర్థ్యపు కొరత గురించి, ఆందోళన గురించి మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. ఎంత వీలైతే అంత ఎక్కువ మాట్లాడండి. దీనివల్లే సమస్య సగం పరిష్కారం అవుతుంది. ఎందుకంటే మీతోపాటు మీ భాగస్వామి కూడా శృంగారంలో నష్టపోతుంది కాబట్టి.. తనతో మీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చర్చించండి. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి రండి.
సెక్స్ కు ముందు ఎక్కువసేపు ఒకరితో ఒకరు గడపడం...అంటే ఒకరికి ఒకరు అలవాటు పడడం వల్ల యాంగ్జైటీ బాగా తగ్గిపోతుంది. దీనికితోడు ఫోర్ ప్లే.. అది కూడా మెల్ల మెల్లగా చాలా టైం తీసుకుంటూ చేయడం వల్ల యాంగ్జైటీ తగ్గి మామూలుగా సెక్స్ లో పాల్గొనగలుగుతారు.
సెక్స్ గురించి ఆలోచన లేకుండా ఇద్దరూ వీలైనంత ఎక్కువ సమయం కలిసి ఉండండి. మీ భాగస్వామికి వేడినూనెతో మసాజ్ చేయండి. లేదా ఇద్దరూ కలిసి షవర్ బాత్ చేయండి. పక్కపక్కనే కూర్చుని చేతిలో చేయి వేసుకుని టీవీనో, సినిమానో చూడండి. ఇవన్నీ రాత్రికి పడకగదిలో చిన్న కాంతిపుంజంలాంటి కోరికకు దారి తీస్తాయి.
లేదంటే ఓ సెక్స్ థెరపిస్ట్ లేదా కౌన్సిలర్ ను కలవడం కూడా మంచిదే. పెద్ద సమస్య ఉంటేనే అని ఆలోచించకుండా, సిగ్గుపడకుండా మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నించండి. దీనివల్ల లైంగిక సమస్యలకు అసలు కారణమేంటో తెలుస్తుంది. ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు దొరుకుతాయి.
పడకగదిలో ఒక్క శృంగారం మీదనే దృష్టి పెట్టకుండా.. కలయిక సమయంలో మీ మెదడును డైవర్ట్ చేయండి. మాంచి సెక్స్ సాంగ్స్ పెట్టండి, లేదా ఏదైనా టీవీ ప్రోగ్రాం చూస్తూ..పని కానియ్యండి. ఎందుకంటే సరిగా పర్ ఫార్మ్ చేయగలనో లేదో అనే ఆలోచన నుంచి మీరు బైటపడాలి. అది మిమ్మల్ని మరింత ఉత్తేజపరిచి, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది.
సరిగా చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ తో కుంచించుకుపోకండి. ఇది మీ ఒక్కడి సమస్య అనే భావననూ మీ మనసులో నుండి తీసేయండి. ఒత్తడి, ఆందోళన, ఆఫీసు పనులు, బాధ్యతలు.. ముఖ్యంగా ఆత్మగౌరవ సమస్యలు ఇలా అనేకం దీనికి కారణమవుతాయి.
అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించండి. నిపుణులు సూచించిన సలహాలు పాటించండి.