సెక్స్ వల్ల అయ్యే గాయాలు.. తగ్గించే మార్గాలు

First Published | Sep 17, 2023, 3:31 PM IST

సెక్స్ స్త్రీ పురుషులిద్దరికీ ఎంతో మేలు చేస్తుంది. తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల గుండె ఫిట్ గా ఉంటుంది. కేలరీలు కూడా బర్న్ అవుతాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అయితే సెక్స్ సమయంలో శరీర గాయలయ్యే అవకాశం కూడా ఉంది. వీటిని తొందరగా ఎలా తగ్గించుకోవాలంటే?  

Food helps for sex

శరీరానికి శృంగారం ఎంతో మేలు చేస్తుంది. అయితే కానీ కొన్నిసార్లు సెక్స్ లో పాల్గొన్న స్త్రీ పురుషులిద్దరూ సంయమనం కోల్పోతుంటారు. దీనివల్ల శరీరానికి గాయాలయ్యే అకాశాలున్నాయి. మరి వీటిని ఎలా తొందరగా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

శరీర భాగాలపై గాయాలు

శృంగారం క్లైమాక్స్ కు చేరినప్పుడు కొన్ని కొన్ని సార్లు స్త్రీ పురుషులిద్దరి శరీరం భాగాలపై గాయాలు అవుతుంటాయి. ముఖ్యంగా బ్రెస్ట్, చేతులు, కాళ్ల ప్రాంతాలలో గీతలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకే మీ క్లైమాక్స్ గాయాల వరకు వెళ్లకుండా ఉండటమే బెటర్. 

Latest Videos


కండరాల నొప్పులు

కండరాల నొప్పులను గాయాలుగా చెప్పలేం. కానీ ఇది శరీరం అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  దీనివల్ల ఏ పని సక్రమంగా చేయలేరు. కండరాల నొప్పులు సెక్స్ సమయంలో ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఇలాంటి నొప్పులే ఉంటే.. వేడి నీటి స్నానం చేయడం మంచిది. 
 

Right time for sex

అలెర్జీ 

రబ్బరు కండోమ్ లను వాడటం వల్ల కూడా చాలా మందికి అలెర్జీలు వస్తాయి. నిజానికి కండోమ్ లను ఉపయోగించడం చాలా అవసరం. ఇది ఎస్టీఐ, ఎస్టీడీల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ మీ ఆరోగ్యాన్ని పాడు చేసే కండోమ్ లను వాడకూడదు. ప్రతిదానికి మార్కెట్లో ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అందుకే అలెర్జీ సమస్యలు రాకుండా ఉండటానికి నాన్-లేటెక్స్ కండోమ్లను ఉపయోగించండి. 
 

click me!