ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా.. రిలేషన్ లో ఉన్నప్పుడు కొన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే అది మీ మనసును పట్టిస్తుంది.
undefined
చేతులు కట్టుకోవడం : ఎదుటివారు ఏం చెబుతున్నారో మీకు వినడం ఇష్టం లేదని, మీ సంభాషణకు అక్కడితో పుల్ స్టాప్ పెట్టారని ఇది చెబుతుంది.
undefined
చిన్ పైకెత్తడం : మాట్లాడుతున్నప్పుడు నేరుగా చూడకుండా తలను పైకెత్తిపెట్టడం.. మీ కాన్ఫిడెన్స్ కు సూచికలా కనిపిస్తుంది. అదే సమయంలో మీరు ఎదుటివారి పట్ల తక్కువ భావనతో ఉన్నట్లుగా సంకేతాలు పంపిస్తుంది.
undefined
వేలుపెట్టి చూపించడం : వేలు చూపిస్తూ మాట్లాడడం రూడ్, అగ్రెసివ్ తనానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇది ఎదుటివారిని మీతో మాట్లాడుతున్నట్లు కాకుండా లెక్చర్ వింటున్న భావనలోకి తోస్తుంది. తామేదో తప్పు చేసిన ఫీలింగ్ కలిగిస్తుంది.
undefined
సరిగా కూర్చోకపోవడం : భుజాలు వాల్చేసి, తల కిందికి వాల్చి ఉండడం.. మీ దుర్భలత్వాన్ని, బలహీనతను తెలుపుతుంది. దీంతో ఎదుటివారికి మీద నమ్మకం, విశ్వాసం కోల్పోయేలా చేస్తంది.
undefined
తప్పుగా షేక్ హ్యాండ్ : షేక్ హ్యాండ్ మామూలుగా ఇస్తే పర్వలేదు. కానీ ఇచ్చేప్పుడు మీ చేయి.. ఎదుటివారి చేతి మీద ఉండేలా షేక్ హ్యండ్ ఇస్తేనే సమస్య. ఇది మిమ్మల్ని మీరు ఎదుటివారికంటే ఎక్కువ అనుకుంటున్నారని తెలుపుతుంది.
undefined
ఫోన్ చెక్ చేసుకోవడం : ఎలాంటి సందర్భాల్లోనైనా సరే నలుగురితో సంభాషణలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి పదేపదే మీ ఫోన్ చెక్ చేసుకోవడం.. ఎదుటివారికి అంతగా నచ్చదు. అది రూడ్ గా కనిపిస్తుంది. మీకు వారితో ఉండడం అంత ఆసక్తి లేదని అనుకునేలా చేస్తుంది.
undefined
మరీ దగ్గరికి వెళ్లి మాట్లాడడం : ఎదుటివారి మీద పడిపోయి మాట్లాడడం సరికాదు. మీ భాగస్వామి మీకు దూరందూరంగా ఉంటుంటే.. మీనుండి పక్కకు జరుగుతుంటే.. వారిని అలా వదిలేయండి. వారంతట వారే తెలుసుకునేలా కొంత సమయం ఇవ్వండి.
undefined
మీ భాగస్వామి కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోతే.. మీరు తనమీద అంత ఆసక్తి లేదన్న భావన కలుగుతుంది.
undefined
మీ ఇద్దరిమధ్య రొమాన్స్ సజీవంగా ఉండాలంటే మీ భాగస్వామిని తరచుగా కౌగిలించుకోవడం చాలా ముఖ్యం. రోజు మొత్తంలో 3 నిమిషాల పాటు కౌగిలించుకోవడం.. మీ బంధాన్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. వెనకనుంచి వెళ్లి గట్టిగా వాటేసుకోవడం వారినీ ఆశ్చర్యంతో పాటు ఆనందంలో ముంచేస్తుంది.
undefined