సెక్స్ తర్వాత ఈ పనులను అస్సలు చేయకండి.. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త

First Published | Jul 31, 2023, 3:35 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే సెక్స్ తర్వాత కొన్ని పరిశుభ్రత చిట్కాలను తప్పకుండా పాటించాలి. అయితే సెక్స్ తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదంటున్నారు నిపుణులు. అవేంటంటే..?
 

Image: Getty Images

టైట్ లోదుస్తులు ధరించి నిద్రపోవడం

సెక్స్ తర్వాత మీ శరీరం వేడెక్కుతుం. అలాగే చెమట ఎక్కువగా పడుతుంది. ఇలాంటి సమయంలో మీరు నైలాన్ లేదా సింథటిక్ లోదుస్తులు ధరిస్తే మీ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు నైలాన్ లోదుస్తులు యోని ఉత్సర్గ, దురద, దద్దుర్లు వంటి సమస్యను కలిగిస్తాయి. అందుకే రాత్రిపూట కాటన్ దుస్తులను ధరించి నిద్రపోవాలి.
 

ఇంటిమేట్ వాష్ 

సెక్స్ తర్వాత మీ యోనిని గోరువెచ్చని నీటితోనే కడగాలి. అంతేకానీ కఠినమైన ఇంటిమేట్ వాష్ లు అస్సలు ఉపయోగించకూడదు. సెక్స్ తర్వాత యోని, దాని చుట్టుపక్కల చర్మం సున్నితంగా మారుతుంది. అందుకే వీటిని అస్సలు ఉపయోగించకూడదు. 
 


ఇంటిమేట్ వైప్స్ 

ఇంటిమేట్ వైప్స్ లో సుగంధ రసాయనాలు ఉంటాయి. వీటి వాడకం వల్ల సంక్రమణ, దద్దుర్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
 

మీ సెక్స్ బొమ్మలను శుభ్రంగా ఉంచండి

సెక్స్ బొమ్మలను వాడిన తర్వాత వాటికి వీర్యం లేదా యోని ఉత్సర్గ అంటుకునే ప్రమాదం ఉంది. వీటిలో బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. కాబట్టి సెక్స్ తర్వాత, ఉపయోగించే ముందు వీటిని బాగా శుభ్రం చేయండి.

మీ చేతులు కడుక్కోండి

సెక్స్ లో మీ భాగాస్వామి సన్నిహిత ప్రాంతాన్ని తాగే అవకాశం ఉంది. ఇది ఎన్నో లైంగిక అంటువ్యాధులకు దారితీస్తుంది. అందుకే సెక్స్ తర్వాత మీ చేతులను సబ్బుతో బాగా కడగండి. లేకపోతే అనేక రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. 
 

వేడి నీటితో స్నానం వద్దు

శృంగారం తర్వాత గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం ఎంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గోరువెచ్చని నీరు బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది. వేడినీటి స్నానం చేయడం మీకే కాదు మీ భాగస్వామికి కూడా హానికరం. అందుకే నార్మల్ వాటర్ తోనే స్నానం చేయండి.
 

Latest Videos

click me!