చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ?

First Published Dec 9, 2022, 10:44 AM IST

చలికాలంలో కొన్నిరకాల ఆహారాలను తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మీ శక్తి తక్కువగా కాకుండా ఉంటుంది. అలాగే జీవక్రియ మెరుగుపడుతుంది. అన్నింటికీ మించి చలిలో కూడా మిమ్మల్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి. 

చలికాలంలో  చల్లని పదార్థాలను అసలే తినాలనిపించదు. కారణం చల్లని ఆహారాలు కడుపులోకి వెళ్లి మరింత చలిని పెంచుతాయని. అందుకే ఈ సీజన్ లో వేడి వేడి భోజనం చేయడమే మంచిది. ఒంట్లో  రోగనిరోధక శక్తి తగ్గడం, వాతావరణంలో మార్పు కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి పెరగడానికి, కాలానుగుణంగా వచ్చే వ్యాధులను నివారించడానికి నిర్ధిష్ట ఆహారాలను తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం తినే ఆహారం మన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు, చల్లని వాతావరణం ఉంటే మీ శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలను తినండి. చల్లని వాతవారంలో మనల్ని ఎలాంటి ఆహారాలు వెచ్చగా ఉంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ghee

నెయ్యి

నెయ్యిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీనిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ (ఎంసిఎఫ్ఎ) కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే  నెయ్యి ఇతర నూనెలు, కొవ్వుల కంటే పోషకపరంగా ఉన్నతమైనది. ఇది కాలేయం ద్వారా నేరుగా గ్రహించబడుతుంది. శక్తిని అందించడానికి కరిగిపోతుంది. నెయ్యిలో ప్రత్యేకంగా బ్యూటిరిక్ ఆమ్లం ఉంటుంది. ఒక చిన్న గొలుసు కొవ్వు ఆమ్లం. ఇది సులభంగా జీర్ణం కావడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. 

నువ్వులు

నువ్వులల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మంచి జీర్ణక్రియకు, సున్నితమైన ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చలికాలంలో నొప్పి, మంట సర్వ సాధారణం. సెసామోల్ అని పిలువబడే నువ్వుల విత్తనాలలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనం శోథ నిరోధక రసాయనాల ఉత్పత్తిని నిరోధించడానికి సహాయపడుతుంది. 
 

అల్లం టీ

అల్లం టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అల్లం మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి ఎంతో మంచిది.  ఇది థర్మోజెనిసిస్ ను ప్రేరేపిస్తుంది. ఇది డయాఫోరెటిక్ గా కూడా పనిచేస్తుంది. ఇది మీ శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉండటానికి సహాయపడుతుంది.
 

ములేథి టీ

ములేథి టీ లో గ్లైసిర్రిజిన్ అనే రసాయనం ఉంటుంది.  దీనిని శీతాకాలంలో తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఈ హెర్బ్ కు దాని తీపి రుచిని ఇస్తుంది. అలాగే ఈ టీలో శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి.
 

తులసి టీ

తులసి ఔషదంకంటే తక్కువేం కాదు. ముఖ్యంగా తులసిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తప్పుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. జలుబు, ఫ్లూను నయం చేయడం నుంచి ఆందోళనను తగ్గించడం వరకు ఇది ఎన్నో జబ్బులను తగ్గించడానికి సహాయపడుతుంది. 
 

బజ్రా లేదా రాగి

బజ్రాలో ఫ్లేవనాయిడ్లు, లిగ్నిన్, ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో అనేక యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్, యాంటీ ఏజింగ్ ప్రక్రియకు వ్యతిరేకంగా పోరాడుతుందది. మన చర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి  కూడా సహాయపడుతుంది.
 

click me!