భోజనం తరువాత నడకతో... బోలెడన్ని ఉపయోగాలు..

First Published Jul 6, 2021, 1:09 PM IST

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. 

నచ్చిన భోజనాన్ని కడుపునిండా తిన్న తరువాత శరీరం మత్తుగా అయిపోతుంది. ఎంచక్కా ఓ కునుకేస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే కునుకేయడం వల్ల అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు కొనితెచ్చుకున్నట్టు అవుతుంది.
undefined
అందుకే తిన్నతరువాత కాసేపు నడిస్తే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు భోజనం తరువాత నడక గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 30 వేలమందిమీద చేసిన ఓ అధ్యయనంలో ఇది తేలింది.
undefined
ప్రతిరోజూ 30 నిమిషాలు, వారానికి 5 రోజులు నడిస్తే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 20% తగ్గిందని తేలింది.
undefined
అయితే, నడిచే సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భోజనం తరువాత మెల్లగా నడవాలి. వాకింగ్ చేసినట్టు వేగంగా నడవడం, బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ చేయకూడదు. దీనివల్ల కడుపునొప్పి, ఉబ్బరం, కొన్నిసార్లు వాంతులు అవ్వొచ్చు.
undefined
మరెలా అంటే మామూలుగా ఇంట్లో నడిచినట్టుగా నడవాలి. అదికూడా 5-6 నిమిషాలు, ఆ తరువాత కొన్ని రోజులకు మితవేగంతో సమయాన్ని 10 నిమిషాలకు పెంచవచ్చు.
undefined
తిన్న వెంటనే బైటికి వెళ్లి వాకింగ్ చేయాలనిపించకపోతే.. ఇంటిలోపలే ఒక గది నుండి మరొక గదిలోకి, ఇంటి చుట్టూ 10 నిమిషాలు నడవండి.
undefined
దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తిన్నవెంటనే మబ్బుగా, బద్దకంగా అనిపిస్తే నడక వల్ల మళ్లీ చురుకుగా తయారవుతారు. అంతేకాదు తినంగానే కడుపు ఉబ్బరం, అతిగా తినడం వల్ల వచ్చిన సమస్యలు పోతాయి.
undefined
భోజనం తర్వాత తేలికపాటి నడక.. జీవక్రియను ప్రేరేపిస్తుంది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత నడక వల్ల, భోజనం చేయగానే ఏదైనా తీపి తినాలనే కోరికను తగ్గిస్తుందని అంటారు.
undefined
శరీరంలో రక్త ప్రకరణ పెరుగుతుంది. బద్దకాన్ని తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే మీ శరీరం ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.
undefined
ముఖ్యంగా డయాబెటిస్ రోగులు, భోజనం తిన్న తర్వాత 10 నిమిషాలు నడవడం మంచిది. అనేక అధ్యయనాలు భోజనానంతర నడకలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించవచ్చని నిరూపించాయి.
undefined
ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల నడక మీ శరీరానికి సరిపోతుంది. మూడు పూటలు కలిసి 30 ని.ల నడక రోజుకి సరిపోతుంది. టిఫిన్, లంచ్, డిన్నర్ ల తరువాత పది పది నిమిషాలు నడవాలి. దీన్ని మెల్లగా 15 నిమిషాలకు పెంచుకోవచ్చు. అయితే ఇంతకంటే ఎక్కువ నడవడం మంచిది కాదు.
undefined
ఒక్కమాటలో చెప్పాలంటే, జీర్ణక్రియను పెంచడానికి, బరువు తగ్గడానికి, పొట్ట సమస్యలను అరికట్టడానికి తేలికపాటి వేగంతో 10 నిమిషాల నడక మంచిది.
undefined
click me!