Mumbai Indians : ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్ లో ఓటమితో టాప్-4లో చేరాలన్న ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ఈ ఓటమి తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
IPL 2024 - Mumbai Indians : ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియాన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఛాంపియన్ గా నిలుస్తుందని ఫ్రాంఛైజీ భావించింది. కోట్లు కుమ్మరించి గుజరాత్ నుంచి తీసుకుని కెప్టెన్సీని అప్పగించింది. అయితే, హార్దిక్ పాండ్యా చేసిన కొన్ని తప్పుల కారణంగా ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ రేసు నుంచి దాదాపు తప్పుకునే స్థితికి చేరుకుంది. ఐపీఎల్ 2024 48వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎకానా క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ల అద్భుతమైన ఆటతీరుతో ఆతిథ్య జట్టు లక్నో ముంబైపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.లక్నో ప్లేఆఫ్‌కు చేరుకునే దిశగా అడుగులు వేయగా, ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించడం ముంబైకి చాలా కష్టం. ఎందుకంటే 10 మ్యాచ్ లను ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం 3 విజయాలు మాత్రమే సాధించింది. 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. రన్ రేటు కారణంగా ఆ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. లక్నో చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ ఓటమికి తమ చెత్త బ్యాటింగ్ కారణమని హార్దిక్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 144/7 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఇషాన్ కిషన్ 32 పరుగులు చేయగా, నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్ కొన్ని మంచి షాట్లు కొట్టి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లారు. డేవిడ్ 18 బంతుల్లో 35 పరుగులు, వధేరా 46 పరుగులు చేశారు. లక్ష్యాన్ని ఛేదించిన లక్నో మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. మార్కస్ స్టోయినిస్ మరోసారి అద్బుత బ్యాటింగ్ తో 62 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ 28 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
హార్దిక్ ఏం చెప్పాడంటే..?
ఓటమి తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, "ప్రారంభ వికెట్లు కోల్పోయినప్పటి నుండి కోలుకోవడం కష్టమని నేను భావిస్తున్నాను. ఈ రోజు మేము దానిని చేయలేకపోయాము. మీరు ఇంకా బంతిని చూసి కొట్టాలి. మా చెత్త బ్యాటింగ్ కారణగా ఓడిపోయాము. ఇప్పటి వరకు మా సీజన్ ఇలాగే ఉందని" అన్నాడు.
ముంబై ప్లేఆఫ్ రేసు ముగిసినట్టే..
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 3 మాత్రమే గెలిచింది. 7 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఆ జట్టు 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక్కడి నుంచి ముంబై వచ్చే 4 మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవడానికి సరిపోని 14 పాయింట్లను మాత్రమే సొంతం చేసుకోగలుగుతుంది. 2022, 2023 సీజన్‌లలో ఏ జట్టు కూడా 14 పాయింట్లతో ప్లేఆఫ్ కు అర్హత సాధించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైని ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాలంటే అద్భుతం జరగాల్సిందే.
ముంబై ఆడబోయే తర్వాతి మ్యాచ్ లు..
ముంబై vs కోల్‌కతా నైట్ రైడర్స్ - ముంబై - 3 మే
ముంబై vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై - 5 మే
ముంబై vs కోల్‌కతా నైట్ రైడర్స్ - కోల్‌కతా - 11 మే
ముంబై vs లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై - 17 మే
INDIA T20 WC 2024 SQUAD : కేఎల్ రాహుల్ కు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ స్టార్..