దీవాళీ2021: ఈ రాశివారికి ఇది బహుమతిగా ఇస్తే.. వారి జీవితం వెలిగిపోతుంది..!

First Published Oct 29, 2021, 11:48 AM IST

 చాలా మంది దీపావళి రోజున.. బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇచ్చే అలవాటు ఉంటుంది. మరి జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి బహుమతి నచ్చుతుందో ఇప్పుడు  చూద్దాం..

దీపావళి పర్వదినం మరో వారం రోజుల్లో మన ముందుకు రానుంది. దీపావళి పండగ.. దాదాపు ఈ పండగను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడతారు. మహిళలు ఇళ్లంతా దీపాలతో అలంకరించి ఆనంద పడితే... పిల్లలు.. టపాసులు కాల్చి సంబరపడతారు. చాలా మంది దీపావళి రోజున.. బంధువులు, స్నేహితులకు బహుమతులు ఇచ్చే అలవాటు ఉంటుంది. మరి జోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశివారికి ఎలాంటి బహుమతి నచ్చుతుందో ఇప్పుడు  చూద్దాం..

1.మేష రాశి..
మేష రాశివారికి ఈ దీపావళి రోజున బహుమతి ఇవ్వాలి అనుకుంటే..  క్రిస్టల్స్ లేదా.. ఏవైనా అద్దాలను ఇవ్వొచ్చు. ఇలాంటివి ఇవ్వడం వల్ల.. వారితో రిలేషన్ కూడా క్రిస్టల్స్ లాగా స్పష్టంగా ఉంటుందని అర్థమట.

candle

2.వృషభ రాశి..
వృషభ రాశి వారికి జీవితంలోని కొన్ని చిక్కులు విప్పడానికి అవసరం కాబట్టి స్వీట్లు, రుచికరమైన వస్తువులు  కొవ్వొత్తులను బహుమతిగా ఇవ్వొచ్చు. దీని వల్ల..  వారి బంధం బలపడుతుంది.
 

3.మిథున రాశి..
మిథున రాశివారికి పసుపు రంగు  దుస్తులను బహుమతిగా ఇవ్వొచ్చు. దాని వల్ల వారికి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. వారి కెరిర్ లో అభివృద్ది సాధించగలుగుతారు.
 

4.కర్కాటక రాశి..
కర్కాటక రాశివారికి ప్రస్తుతం ఏది అవసరమో వాటిని బహుమతిగా ఇవ్వండి. వారి ఆరోగ్యం, కెరీర్ పరంగా ఏది వారికి అసవరం అవుతుందో.. దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులను బహుమతిగా ఇవ్వడం మంచిది.

5.సింహ రాశి..
మంచి సువాసన గల కొవ్వొత్తులను కూడా వారికి అందించండి. అలాగే, విద్యుత్తుపై పనిచేసే చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా బహుమతిగా ఇవ్వండి . ఇది వారికి స్థిరత్వాన్ని తీసుకురావచ్చు.

6.కన్య రాశి..
ఈ రాశివారికి.. తాజా పండ్లు, స్వీట్స్ లాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు. ఇలా వీటీని బహుమతిగా ఇవ్వడం వల్ల.. మీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు తగ్గిపోయే అవకాశం ఉంది.
 

7.తుల రాశి..
ఈ రాశివారికి కొత్త దుస్తులను లేదా.. కొన్ని పువ్వులను బహుమతిగా ఇవ్వండి. వీటిని ఇవ్వడం వల్ల.. మీ బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుస్తుంది.

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారికి అందం పట్ల ఆసక్తి ఎక్కువ. కాబట్టి.. వీరికి అందానికి సంబంధించిన లేదంటే..  చర్మ సంరక్షణకు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వాలి. ఇది భవిష్యత్తులో మీకు రాబోయే గొడవలను తగ్గించడానికి కూడా సహాయం చేస్తుంది.
 

9.ధనస్సు రాశి..
దీపావళి పండగ అంటేనే.. అలంకరణ. ఈ పండగ రోజున అందరూ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. కాబట్టి.. ఈ రాశివారికి  అలంకరణకు సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వాలి.

10.మకర రాశి..
ఈ రాశివారి ఇంట్లోకి సంబంధించిన ముఖ్యంగా కిచెన్ కి సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వాలి. ఈ వస్తువు వారికి ఇవ్వడం పట్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి కెరిర్ కి కూడా ఎంతో సహాయపడుతుంది.
 

11.కుంభ రాశి..
కుంభ రాశివారికి దీపావళి పర్వదినం రోజున  పండ్లు  స్వీట్లు, ఈ కలయిక కుంభరాశి వారికి జీవితంలో అవసరం, ఇది వాటిని సమతుల్యం చేస్తుంది. కాబట్టి..వాటిని బహుమతిగా ఇవ్వడం మంచిది.

12.మీన రాశి..
ఈ రాశివారికి ఇంట్లో సువాసన వెద జల్లేవి,. ధూపం లాంటివి, సువాసన వెద జల్లే మంచి వస్తువులు బహుమతిగా ఇవ్వాలి.  ఇవి ఇవ్వడం వల్ల మీన రాశివారు కుటుంబంలో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.

click me!