చిరంజీవి సినిమా పోస్టర్ ని కాపీ కొట్టి అద్భుతం సృష్టించాడు..డైరెక్టర్ మామూలోడు కాదుగా

First Published May 4, 2024, 5:32 PM IST

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మెగాస్టార్ చిరంజీవి సినిమా పోస్టర్ ని ఆదర్శంగా తీసుకుని అద్భుతమే సృష్టించాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం సంక్రాంతి విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

టాలీవుడ్ లో చాలా సందర్భాల్లో కథలు, పోస్టర్ లు, సన్నివేశాలు కాపీ చేసినట్లు ఆరోపణలు ఎదురవుతుంటాయి. కానీ ఆదర్శంగా తీసుకుని కొందరు కొన్ని చిత్రాలని రిక్రియెట్ చేస్తుంటారు. అయితే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మెగాస్టార్ చిరంజీవి సినిమా పోస్టర్ ని ఆదర్శంగా తీసుకుని అద్భుతమే సృష్టించాడు. 

ఇంతకీ ఏం జరిగిందంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం సంక్రాంతి విడుదలై పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 300 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రం అంజనాద్రి పై వెలసిన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచింది. 

ఈ విగ్రహంలో అంజేయ స్వామి ని చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ. అంజనేయ స్వామి విగ్రహాన్ని చాలా పవర్ ఫుల్ గా రూపొందించారు. మనం చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలు చూసుంటాం. కానీ హను మాన్ చిత్రంలో ఉండే స్టాచ్యూ ఏదో కొత్తదనంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. 

అయితే దీనివెనుక ఉన్న సీక్రెట్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఇంటర్వ్యూలో బయట పెట్టారు. హను మాన్ చిత్రంలో విగ్రహాన్ని చిరంజీవి గారి స్టాలిన్ చిత్రంలోని పోస్టర్ చూసి దాని ఆదర్శంగా రూపొందించాం. స్టాలిన్ మూవీలో చిరంజీవి గారు చేతులు కట్టుకుని పవర్ ఫుల్ లుక్ తో నిలబడే ఫోజు ఉంది. 

ఆ పోస్టర్ చూసినప్పుడల్లా గూస్ బంప్స్ ఫీలింగ్ కలుగుతుంది. హను మాన్ చిత్రంలో విగ్రహం కూడా అలాగే ఉండాలని అనుకున్నా. చిరంజీవి గారి పోస్టర్ ఆధారంగా దానిని రూపొందించాం. మేము అనుకున్న దానికంటే అద్భుతంగా వచ్చినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. 

చిరంజీవి హనుమాన్ భక్తుడు అనే సంగతి తెలిసిందే. హను మాన్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా చిరు హాజరయ్యారు. ఆ విధంగా ఈ చిత్రానికి చిరంజీవి, ఆంజనేయ స్వామి బాగా కలసి వచ్చారు. 

click me!