ఎన్టీ రామారావు కొడుకైనా నందమూరి హరికృష్ణ బాలనటుడిగానే సినిమాలు చేశారు. మెయిన్ లీడ్‌గా నాగ్‌తో నటించిన `సీతారామరాజు` చిత్రమే మొదటి మూవీ కావడం విశేషం. ఆయన్ని చూసేందుకు జనం ఆసక్తి చూపించడంతో వరుసగా సినిమాలు చేశారు హరికృష్ణ. `లాహిరి లాహిరి లాహిరలో`, `శివరామరాజు` చిత్రాల్లో మెయిన్ లీడ్‌గా చేయగా, `సీతయ్య`లో ఏకంగా సోలో హీరోగా నటించి హిట్ కొట్టాడు. `టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్`, `స్వామి`, `శ్రావణమాసం` సినిమాల్లో నటించారు. ఆయన 2018లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. హరికృష్ణకి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి జానకీరామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని జన్మించగా, రెండో భార్యకి జూ ఎన్టీఆర్ జన్మించడం విశేషం.