చిన్న పిల్లల్ని ఏసీ, కూలర్ రూం లో పడుకోబెట్టొచ్చా?

First Published | May 4, 2024, 4:50 PM IST

మండుతున్న ఎండలకు పెద్దలే తట్టుకోలేకపోతున్నారు. ఇక చిన్న పిల్లలేం తట్టుకుంటారు. అందుకే చాలా మంది చిన్న పిల్లల్ని ఏసీ లేదా కూలర్ దగ్గర పడుకోబెడుతుంటారు. అసలు చిన్న పిల్లల్ని కూలర్, ఏసీ రూముల్లో పడుకోబెట్టొచ్చా? 

ఎండాకాలంలో స్టార్ట్ కాగానే అందరి ఇండ్లలో ఏసీ, కూలర్లు ఆన్ లోనే ఉంటాయి. తేమతో కూడిన వేడిని తగ్గించడానికి ఏసీ, కూలర్ గాలి పనిచేస్తుంది. అందుకే చిన్న పిల్లల్ని కూడా ఏసీ, కూలర్ దగ్గర పడుకోబెడుతుంటారు. కానీ చిన్న పిల్లల్ని ఏసీ, కూరల్ దగ్గర పడుకోబెట్టొచ్చా? ఒక వేళ చిన్న పిల్లల్ని ఏసీ, కూలర్ రూముల్లో పడుకోబెడితే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పిల్లలకు ఏసీ, కూలర్ ఎంత సురక్షితం?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లల్ని ఏసీ, కూలర్ చల్లని గాలిలో ఉంచొచ్చు. ఈ గాలి బిడ్డకు ఎలాంటి హాని చేయదు. కానీ ఒక్కోసారి చల్లటి గాలి వల్ల పిల్లలకు జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే? 
 


మీ బిడ్డ ఒక నెల కంటే తక్కువ వయస్సు ఉంటే ఏసీ రూముల్లో పడుకోబెట్టేముందు వారికి నిండుగా కప్పండి. అంటే మార్కెట్ లో దొరికే రోంపర్లను వేయొచ్చు. ఇవి పిల్లలను పూర్తిగా కవర్ చేస్తాయి. అయితే మీ బిడ్డ ఒక నెల కంటే పెద్దవాడైతే ఇంతలా పూర్తిగా కవర్ చేయాల్సిన అవసరం లేదు. కాటన్, లినిన్ తో చేసిన దుస్తులు ఈ సీజన్ లో వారికి బెస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. కానీ ఎక్కువ దుస్తులు వేయాల్సిన అవసరం లేదు. 

గది ఉష్ణోగ్రత

ఎండాకాలంలో వేడి గదులు పిల్లలకు జ్వరం వచ్చేలా చేస్తుంది. అందుకే పిల్లలను సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచాలి. మీ పిల్లలను ఏసీ గది నుంచి మరొక గదికి మారుస్తున్నట్టైతే వెంటనే అలా చేసే తప్పు చేయకండి. ఎందుకంటే మీ పిల్లల శరీరాన్ని గది ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి ముందుగా ఏసీని కొద్దిసేపు ఆఫ్ చేయండి. అప్పుడు పిల్లాడిని గదిలోంచి బయటకు తీసుకెళ్లండి. పిల్లలను ఎక్కువసేపు చల్లని ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల తక్కువ శరీర ఉష్ణోగ్రత వచ్చే ప్రమాదం ఉంది. ఇది మీ పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 
 

ఏసీ ప్రత్యక్ష గాలి

మీ బిడ్డను ఏసీ గదిలో పడుకోబెట్టినట్టైతే ఏసీ ప్రత్యక్ష గాలి వారిపై పడకుండా చూసుకోండి. ఒకవేళ పిల్లలపై ఏసీ గాలి డైరెక్ట్ గా పడినట్టైతే మీ పిల్లలకి జ్వరం లేదా జలుబు వచ్చే ప్రమాదం ఉంది. ఏసీలో పడుకునేటప్పుడు పిల్లలపై లైట్ షీట్ లేదా దుప్పటిని కప్పాలి. 
 

Latest Videos

click me!