ఈ లక్షణాలు కనపడుతున్నాయా..? అయితే మీకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లే..!

First Published | May 4, 2024, 5:00 PM IST

మనకు రాబోయే చెడు గురించి మన ఇంట్లో జరిగే కొన్ని సందర్భాలు, సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరి... ఎలాంటి సంకేతాలు వస్తే... మనకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
 

Chanakya Niti

మనకు ఏదైనా మంచి జరిగితే ఆనందపడతాం, చెడు జరిగితే బాధపడతాం. కానీ.. మంచి అయినా, చెడు అయినా జరిగే ముందు మనకు ముందుగానే కొన్ని సంకేతాల ద్వారా మనకు ముందుగానే తెలుస్తుందట. చాణక్య నీతి కూడా దీని గురించి చెబుతోంది. మనకు రాబోయే చెడు గురించి మన ఇంట్లో జరిగే కొన్ని సందర్భాలు, సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరి... ఎలాంటి సంకేతాలు వస్తే... మనకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

tulsi


1.తులసి మొక్క ఎండిపోవడం... హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తాం. రోజూ ఇంట్లో ఆ మొక్కకు నీరు పోసి, పూజలు చేస్తాం. అలాంటిది ఆ మొక్క సడెన్ గా ఉన్నట్లుండి ఎండిపోయింది అనుకోండి... మనకు బ్యాడ్ టైమ్ మొదలైందని అర్థమట.  అంతేకాదు.. తులసి మొక్క ఎండిపోతే.. మనకు ఆర్థిక సమస్యలు వస్తున్నాయి అని సూచిస్తుందట. కాబట్టి... ఈ మొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
 


couple fight

కుటుంబంలో కలహాలు: చానక్య నీతి ప్రకారం, మీ ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుంటే, అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉండదు. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుంది. కాబట్టి, వీలైనంత సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించండి.
 

Glass Break


గాజు పగలడం: చాణక్యుడు ప్రకారం, ఏదైనా గాజు వస్తువు పదేపదే ఇంట్లో  పగిలిపోతుంది అంటే,... కుటుంబ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది అని అర్థం.. గాజును పగలగొట్టడం సాధారణంగా చెడ్డ శకునముగా సూచిస్తారు.

పూజ లేని ఇల్లు: చాణక్యుడు ప్రకారం, ఇంట్లో ఆనందం , శ్రేయస్సు కోసం రోజువారీ పూజ అవసరం.  మీరు ఇంట్లో ప్రతిరోజూ ఈ పూజ చేస్తే, లక్ష్మీ దేవి మీ ఇంటికి వెళ్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. పూజ లేని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి, ఇంట్లో రోజూ పూజ చేస్తూ ఉండాలి.


పెద్దలను అగౌరవపరచడం: చాణక్యుడు ప్రకారం, పెద్దలను అగౌరవపరిచే ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. ఆ ఇంట్లో సంతోషం ఉండదు. అందుకే ఇంట్లో పెద్దలను ఎప్పుడూ గౌరవించాలి.

Latest Videos

click me!