చెడు మీద మంచి సాధించిన విజయమే.. దుర్గాష్టమి. విజయదశమి(Vijayadashami). దసరా(Dussehra)కు ముందు నవరాత్రులు (Navratri 2021) అమ్మవారిని ఒక్కో అవతారంలో పూజిస్తారు. ఈ యేడు దసరా నవరాత్రులు దగ్గరపడ్డాయి. 10 రోజుల పాటు జరిగే దసరా నవరాత్రులు ఈ యేడాది(2021) అక్టోబర్ 7 నుంచి మొదలు కానుంది. ఈ పండుగను దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగలో శక్తికి చిహ్నమైన దుర్గాదేవి(Maa Durga)ని పూజిస్తారు. నవరాత్రి అంటే 'తొమ్మిది రాత్రులు' అని అర్ధం.
ఈ సంవత్సరం అక్టోబర్ 7 న మొదలయ్యే నవరాత్రిలు అక్టోబర్ 15 వరకు జరుగుతాయి. అక్టోబర్ 15/16 న, జరుపుకునే విజయదశమిని దసరా అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం నవరాత్రులు ముగిసిన తరువాతి రోజు చేసుకుంటారు.
ఈ నవరాత్రి సమయంలో భక్తులు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంద మాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే దుర్గామాత తొమ్మిది రూపాలను ఆరాధిస్తారు.
నవరాత్రి 2021 తేదీలు, తిథి, నవదుర్గ రూపాలు..
అక్టోబర్ 7 న ప్రతిపాద తిథి నాడు ఘటస్థాపన, శైలపుత్రి పూజ చేస్తారు.
అక్టోబర్ 8 న ద్వితీయ తిథి నాడు, బ్రహ్మచారిణి పూజ చేయాలి.
అక్టోబర్ 9 న తృతీయ, చతుర్థి నాడు చంద్రఘంట పూజ, కూష్మాండ పూజ చేయాలి.
అక్టోబర్ 10 న పంచమి తిథి కోసం స్కందమాత పూజ చేయాలి.
అక్టోబర్ 11 న, షష్ఠి తిథి కోసం కాత్యాయని పూజ చేయాలి.
అక్టోబర్ 12, సప్తమి తిథి, కాళరాత్రి పూజ చేయండి
అక్టోబర్ 13 న, అష్టమి తిథి మహా గౌరీ పూజ చేస్తారు
అక్టోబర్ 14 న, నవమి తిథి సిద్ధిధాత్రి పూజ చేస్తారు
అక్టోబర్ 15 న, దశమి తిథి నవరాత్రి పరణం/దుర్గా విసర్జనం చేస్తారు

ఈ నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటంటే.. :
శివుడు తన భార్య అయిన దుర్గాదేవికి.. ఆమె తల్లిని చూడడానికి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే అనుమతి ఇచ్చారని అవే ఈ నవరాత్రులని నమ్ముతారు. అదే సమయంలో, దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరిస్తుంది. అందుకే, దుర్గాదేవి శక్తికి ప్రతిరూపంగా, కాళీ మాతగా చెప్పబడుతుంది. దేవతలందరిలోనూ దుర్గాదేవి అత్యంత శక్తివంతురాలని, ఆమె శక్తి శాశ్వతమైనదని చెబుతారు. ఈ శక్తిని మళ్లీ సృష్టించడం, నాశనం చేయడం లాంటివి చేయలేరని అంటారు.
విశిష్టత : తొమ్మిది రాత్రులు, అమ్మవారి తొమ్మిది రూపాలు చాలా వైభవంగా పూజించబడతాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 15 వ తేదీన 10 వ రోజు, ప్రజలు విజయదశమి అంటే దసరా పండుగ, రావణ, మేఘనాద్ మరియు కుంభకర్ణల భారీ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. నవరాత్రి అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది.
వేడుకలు : నవరాత్రి ఈ తొమ్మిది రాత్రులు, ప్రజలు ఉపవాసాలు పాటిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి, ప్రజలు రాముడి కథను వర్ణిస్తారు. ఎనిమిదవ రోజు, కన్యా పూజను జరుపుకుంటారు, దీనిలో బాలికలను పూజించి ప్రసాదం, ఆహారం, స్వీట్లు అందిస్తారు. దేశవ్యాప్తంగా ప్రజలు సామూహికంగా దాండియా, గర్బా కార్యక్రమాలను నిర్వహిస్తారు.