రోజూ యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందా?

First Published | Nov 27, 2024, 3:58 PM IST

అందం పెంచుకోవడానికి మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ.. యాలకుల వాటర్ తాగితే అందం పెరుగుతుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

దాదాపు మన అందరి కిచెన్ లో యాకులు ఉంటాయి. సుగంధ్ర ద్యవ్యాలలో ఇది కూడా ఒకటి. మనం చేసే చాల ా వంటలకు రుచిని, సువాసన పెంచడానికి వాడుతూ ఉంటారు.  స్వీట్లు, మంసాహార వంటల్లో ఎక్కువగా యాలకులు వాడుతూ ఉంటారు. అంతెందుకు చాలా మంది టీ తయారు చేసుకునేటప్పుడు కూడా యాలకులు వేస్తూ ఉంటారు. ఇవి వేసిన టీ తాగడం వల్ల.. ఒత్తిడి తగ్గి.. మైండ్ ప్రశాంతంగా అనిపిస్తుందట.

ఇవన్నీ మనకు తెలుసు. ఇవే  యాలకులు మన అందాన్ని పెంచడానికి కూడా సహాయపడతాయని మీకు తెలుసా? మీరు చదివింది నిజమే. యాలకుల వాటర్ మన చర్మంపై అద్భుతంగా పని చేస్తుందట.  ముఖ్యంగా చర్మాన్ని లోపలి నుంచి పోషించడానికి ఈ నీరు సహాయపడుతుంది. మరి, ఈ యాలకుల నీరు తాగితే కలిగే ప్రయోజనాలేంటి? వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...

యాలకుల నీరు ఎలా తయారు చేయాలి?

2 నుండి 3 పచ్చి యాలకులను బాగా పొడి చేసి, అవసరమైనంత నీటిని కలపాలి. ఈ నీటిని 10 నుండి 15 నిమిషాలు బాగా మరిగించాలి. ఈ నీరు లేత గోధుమ రంగులోకి మారే వరకు మరిగించాలి. తర్వాత వడకట్టి అందులో అవసరమైతే కొన్ని చుక్కల నిమ్మరసం లేదా బత్తాయి సిరప్ కలుపుకోవచ్చు. 

యాలకులను వేడి నీటిలో నానబెట్టి తయారుచేసే శక్తివంతమైన పానీయంగా ఏలకుల నీటిని చెప్పవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీని వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Latest Videos


యాలకుల నీటి ప్రయోజనాలు : చర్మ సంరక్షణ:

యాలకులలో యాంటీఆక్సిడెంట్లు, బాక్టీరియా నిరోధక లక్షణాలు ఉన్నాయి. అవి మొటిమలను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా సహాయపడతాయి. ప్రతిరోజూ యాలకుల నీరు తాగడం వల్ల శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. దీని వల్ల కాంతివంతమైన, మెరిసే చర్మం లభిస్తుంది. 

యాలకుల నీటి ప్రయోజనాలు : శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది!

యాలకుల నీరు శరీరంలోని విష పదార్థాలను బాగా తగ్గిస్తుంది. జీర్ణక్రియను కూడా ప్రోత్సహించడం వల్ల మీ కడుపు శుభ్రపడుతుంది. శరీరంలో విష పదార్థాలు తొలగిపోవడం వల్ల మీకు ప్రకాశవంతమైన రూపం వస్తుంది. చర్మాన్ని లోపలి నుండి తేమగా ఉంచుతుంది. చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ముఖంలోని మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించడానికి యాలకుల నీరు సహాయపడుతుంది. 

యాలకుల నీటి ప్రయోజనాలు : నోటి దుర్వాసన పోతుంది!

నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఏలకుల నీరు మీ నోటిలోని విష పదార్థాలను, బాక్టీరియాలను తొలగిస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన పోతుంది. చిగుళ్ల వాపు, దంతక్షయం తగ్గుతాయి. ఏలకుల గింజలలో ఉండే సినోల్, టెర్పినైన్, లిమోనెన్ వంటి సమ్మేళనాలు మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. సినోల్ క్రిమిసంహారిణిగా పనిచేయడం వల్ల నోటి దుర్వాసనకు కారణమయ్యే బాక్టీరియాలను పూర్తిగా తొలగిస్తుంది.

click me!