ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఏం చెయ్యాలి.. ఎలా ఉండాలో తెలుసా?

First Published Nov 24, 2021, 4:45 PM IST

ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకునేటప్పుడు వారి ప్రేమ (Love) పదిలంగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమ అనేది ఎందుకు ఎప్పుడు ఎలా కలుగుతుందో చెప్పలేము.  ఇలా ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉన్నప్పుడు వారి ప్రేమ కొద్ది రోజులు బాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి లేదా అబ్బాయి బ్రేకప్ (Breakup ) చెప్పేస్తారు. దాంతో వారు ప్రేమించిన వ్యక్తి మోసం చేశారని బాధపడుతుంటారు. వారికి ఏం చేయాలో తెలియక దిగ్భ్రాంతి చెందుతారు. వారి బాధను ఇతరులతో చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తారు. ఇలా వారి మనస్సు మరింత గాయపడుతుంది. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక ఆ బాధ నుంచి బయటకు రాలేక సతమతమవుతుంటారు. ఇలా ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఏం చేయాలో దాని గురించి అవగాహన కల్పించడం ఈ ఆర్టికల్ ఉద్దేశం.
 

ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకునేటప్పుడు మొదట్లో వారి ప్రేమ సాఫీగా నడుస్తుంది. కొన్ని రోజుల తరువాత వారి మధ్య మనస్పర్ధలు (Conflicts) ఏర్పడుతాయి. ఈ మనస్పర్థల కారణంగా వారి ప్రేమ బ్రేకప్ అవుతుంది. ఎవరి దారి వారు చూసుకోవడానికి ప్రయత్నిస్తారు.

ఒకరు హ్యాపీగా (Happy) ఉంటారు. మరొకరు బాధపడుతుంటారు. వారి బాధకు కారణం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని. మనం ప్రేమించిన వ్యక్తి మోసం చేశారు అంటే తనకు కావలసింది తను తీసుకొని తన అవసరం తీరాక వదిలి వెళ్ళిపోయాడు అని అర్థం.
 

కానీ వారు మీ స్వచ్ఛమైన ప్రేమను (Pure love) అర్థం చేసుకోలేదు. అలాగే తనకు కావలసినది నీ దగ్గర లేదని అర్థం. తనకు కావలసింది మనం ఇవ్వలేక పోయినప్పుడు మనం ఫెయిల్యూర్ (Failure) అయినట్టు అర్థం. ఈ ఫెయిల్యూర్ మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది.

ప్రేమించిన వ్యక్తి బాధ పడుతుంటే చూసి తట్టుకోలేకపోవడం అది నిజమైన ప్రేమ. అలా కాకుండా హ్యాపీగా తన పని తను చూసుకుంటే అది నిజమైన ప్రేమ అనిపించదు. నిజంగా ప్రేమించిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తారు. వారి గుండెల్లో మన స్థానం లేనప్పుడు అది నిజమైన ప్రేమ అనిపించుకోదు.

కొంతమంది టైంపాస్ (Timepass) కోసం ప్రేమిస్తారు. వారి అవసరాలన్నీ తీసుకున్నాక  బ్రేకప్ అవుతారు. ఇలా స్వార్థంతో కూడిన ప్రేమ నిజంగా ప్రేమించిన వారి మనసుకు గాయాన్ని కలిగిస్తుంది. మనసుకు కలిగిన గాయం నుంచి కోలుకోవడానికి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ప్రేమించిన వారితో గడిపిన మధుర క్షణాలను (Sweet moments) నిరంతరం గుర్తు చేసుకుంటూ మరింత బాధ చెందుతారు. ప్రేమించిన వారిని మర్చిపోవడం చాలా కష్టమే కానీ జీవితం ఇంతటితో ముగిసిపోలేదు. ఈ మీ ఓటమి నీకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఒక వ్యక్తిని నువ్వు సిన్సియర్ గా ప్రేమించి నీ వంతు ప్రయత్నం చేసావు.

కానీ వారు నిన్ను టైంపాస్ కోసం ప్రేమించారు. అలాంటి వారి కోసం నీ జీవితాన్ని (Life) ఎందుకు నాశనం చేసుకోవాలి. మన ప్రేమ సిన్సియర్ (Sincere) గా ఉన్నప్పుడు మనం ఏ తప్పు చేయలేదు మనం తలెత్తుకొని ముందుకు నడవాలి. అప్పుడే మనం మోసం చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పగలం.
 

click me!