జనవరిలో.. పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే..

First Published Jan 2, 2024, 9:43 AM IST

జనవరి నెలలో మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు నుంచి శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసేయొచ్చు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15న వస్తుంది. దీని తర్వాత పెళ్లిళ్లు చేసుకోవడానికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. 
 

Marriage


నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెలలో ప్రధాన పండుగలను జరుపుకోనున్నారు. సూర్యుడు ఈ నెలలో మకర రాశిలో ప్రవేశించడంతో ఖర్మాలు కూడా ముగుస్తాయి. ఖర్మల సమయంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఖర్మాలు ముగిసిన తర్వాత అన్ని శుభకార్యాలు జరుగుతాయి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15న వస్తుంది. ఆ తర్వాత వివాహాలు చేయడానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. జనవరి నెలలో పెళ్లి ముహూర్తం, తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఖర్మాలు ఎప్పుడు ముగుస్తాయి?

జ్యోతిష్యుల ప్రకారం.. జనవరి 15న వేకువజామున 02.43 గంటలకు సూర్యభగవానుడు ధనుస్సు రాశిని వదిలేసి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే మకర సంక్రాంతి జనవరి 15న వస్తుంది. ఈ రోజున ఖర్మాలు ముగుస్తాయన్న మాట. ఆ మరుసటి రోజు నుంచే పెళ్లి సందడి మొదలవుతుంది.
 

Latest Videos


జనవరి నెలలో పెళ్లి ముహూర్తం

జనవరి 16 నుంచి పెళ్లిసందడి మొదలవుతుంది. ఈ రోజు పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఈ రోజున ఉత్తర భాద్రపద, రేవతి నక్షత్రం .
జనవరి 17న కూడా పెళ్లి ముహూర్తం ఉంది. ఈ రోజు తిథి సప్తమి. అలాగే ఆ నక్షత్రమండలం రేవతి.
జనవరి 21న మంచి పెళ్లి ముహూర్తం ఉంది. ఈ రోజు ద్వాదశి తిథి. అలాగే నక్షత్రాలు రోహిణి, మృగశిర.
జనవరి 22న కూడా పెళ్లి ముహూర్తం ఉంది. ఈ రోజును ప్రదోష వ్రతంగా జరుపుకుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. త్రయోదశి నాడు వివాహం చేసుకోవడం చాలా శుభప్రదం. నక్షత్రరాశి మృగషిర.

Marriage after 30

జనవరి 27న కూడా ఒక పెళ్లి ముహూర్తం ఉంది. ఈ రోజు మాఘ మాసంలోని కృష్ణ పక్షం రెండో రోజు. నక్షత్రరాశి మాఘం.
జనవరి 28న పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఈ రోజు మాఘ మాసంలోని కృష్ణపక్షంలో మూడో రోజు. నక్షత్రరాశి మాఘం.
జనవరి 30న కూడా పెళ్లి పీఠలు ఎక్కొచ్చు. ఈ రోజు కృష్ణపక్షంలో ఐదో రోజు.  ఉత్తర ఫల్గుణి, హస్త నక్షత్రం.

జనవరి నెలలో చివరి వివాహ ముహూర్తం జనవరి 31 కూడా ఉంది. ఈ రోజు తిథి పంచమి, షష్టి తిథి. అలాగే నక్షత్రమండలం హస్తం. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అయితే లోకల్ డేట్ లో పెళ్లి ముహూర్తంలో కాస్త తేడా ఉండొచ్చు. కాబట్టి అందుకే స్థానిక పండితులను సంప్రదించాలి. జ్యోతిషశాస్త్రంలో మాఘ మాసం వివాహానికి పవిత్రమైనదిగా భావిస్తారు.

click me!