పుష్ప 2, ఆ విషయంలో గందరగోళం, అసలు ఏం జరుగుతుంది?

First Published | Nov 28, 2024, 4:39 PM IST

పుష్ప 2 విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సెన్సార్ కోసం ఫస్ట్ కాపీ వదిలారని సమాచారం. అయితే పుష్ప 2 విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది.. 
 

దర్శకుడు సుకుమార్ ఓ విషయంలో రాజమౌళిని మించిపోయాడు. సినిమాకు ఏళ్లకు ఏళ్ల సమయం తీసుకుంటున్నాడు. ఎప్పుడో ఆగస్టులో విడుదల కావాల్సిన మూవీ డిసెంబర్ కి వాయిదా పడింది. అయినా అనుకున్న సమయానికి పుష్ప 2 మూవీ చిత్రీకరణ పూర్తి కాలేదు. పది రోజుల్లో విడుదల అనగా.. షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టారు. 

Allu Arjun

పుష్ప టీమ్ తో ఐదేళ్ల జర్నీ ముగిసిందని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అంతకంతకు పుష్ప 2 డిలే కావడంతో అల్లు అర్జున్-సుకుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయనే పుకార్లు కూడా వినిపించాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో దర్శక నిర్మాతలకు చెడింది. సమయానికి మ్యూజిక్ ఇవ్వలేదని దేవిశ్రీ పై మండిపడ్డారేమో కానీ.. ఆయన బహిరంగంగా తమ వివాదాన్ని బయటపెట్టాడు. 


Devisri Prasad


మా నిర్మాతలకు నాపై ప్రేమ కంటే ఆరోపణలు ఎక్కువయ్యాయని నేరుగా చెప్పాడు. ఇకపై సుకుమార్ తో దేవిశ్రీ పని చేయకపోవచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. పుష్ప 2 బీజీఎమ్ విషయంలో ఎస్ ఎస్ థమన్ ని ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేశారు. బీజీఎమ్ వరకు థమన్ అందిస్తున్నారని తెలిసింది. పరోక్షంగా ఈ విషయాన్ని నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇది కూడా దేవిశ్రీ ప్రసాద్ కి నచ్చకపోయి ఉండొచ్చు. 

devisri prasad

థమన్ కంటే దేవిశ్రీ ప్రసాద్ చాలా సీనియర్స్. గతంలో ఇద్దరు ఓకే మ్యూజిక్ డైరెక్టర్ వద్ద పని చేశాడు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి ఒక దశాబ్దం ముందే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఒక జూనియర్ ని తన ప్రాజెక్ట్ లోకి తీసుకు రావడం దేవిశ్రీకి కోపం తెప్పించి ఉండవచ్చు. ఇదిలా ఉండగా... థమన్ బీజీఎమ్ ని పుష్ప 2 కి వాడటం లేదట. థమన్ బీజీఎమ్ నచ్చకపోవచ్చు లేదా.. దేవిశ్రీకే ఆ బాధ్యత కూడా ఇద్దామని అనుకోవచ్చు. 

ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 5న మూవీ విడుదలవుతుంది. అంటే వారం రోజుల్లో మూవీ థియేటర్స్ లోకి రానుంది. అయినా పుష్ప 2 ఫైనల్ వెర్షన్ సిద్ధం కాలేదు. అలాగే మ్యూజిక్ విషయంలో సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. సెన్సార్ కోసం ఫస్ట్ కాపీ బయటకు తెచ్చారు. అన్నపూర్ణ స్టూడియోలో షో వేసుకుని చూశారట. అల్లు అరవింద్ కి పిచ్చ పిచ్చగా నచ్చిందట. సుకుమార్-అల్లు అర్జున్ షో ముగిశాక ఆలింగనం చేసుకున్నారట. 

దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లు అంటున్నారు. రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక రోల్స్ చేస్తున్నారు. అన్ని హక్కులు కలిపి పుష్ప 2 రూ. 1000 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. 

Latest Videos

click me!