ప్యాకెట్ పాలు మరిగించకూడదా?

First Published | Nov 28, 2024, 4:50 PM IST

మీరు ప్యాకెట్ పాలు కొంటున్నారా..? వాటిని రోజుకి  ఎన్నిసార్లు వేడి చేస్తున్నారు..? వీటిని ఎక్కువసేపు వేడి చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసా?

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ ప్యాకెట్ పాలు వాడుతున్నారు. ఎందుకంటే.. వేరే ఆప్షన్ మరోటి లేదు. ఉదయం లేస్టే పిల్లలకు పాలు, ఇంట్లో పెద్దలకు టీ, కాఫీ, మధ్యాహ్నం భోజనంలోకి పెరుగు కావాలంటే.... పాలు ఉండాల్సిందే. కానీ.. ఈ రోజుల్లో స్వచ్ఛమైన గేదె పాలు ఎవరికి దొరుకుతాయి. అందుకే ప్యాకెట్ పాలు వాడేస్తున్నారు. 

ఇప్పటికీ గ్రామాల్లో ఉండే వారికి స్వచ్ఛమైన ఆవు, గేదె, మేక పాలు దొరుకుతాయి. కానీ, నగరాల్లో ఉండేవారికి ఆ ఆప్షన్ ఉండదు కాబట్టి..ప్యాకెట్ పాలు వాడుతున్నాం. కానీ... ఈ పాలు వాడే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటో చూద్దాం..


ప్యాకెట్ పాలను వేడి చేయకూడదా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.. సాధారణంగా మనం దుకాణాల్లో కొనే ప్యాకెట్ పాలు పాశ్చరైజ్ చేసి ఉంటాయి. పాలని ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వరకు వేడి చేసి ప్యాకెట్లలో నింపి ఉంటారు. 

కొన్ని పాల ప్యాకెట్ల మీద ఏ పాలను దేనికి వాడాలి అని స్పష్టంగా రాసి ఉంటుంది. పాలు తెచ్చాం కదా అని ఒకసారి వేడి చేస్తే చాలు. మళ్ళీ మళ్ళీ వేడి చేస్తే ప్రయోజనం ఉండదు.

ఇప్పటికే వేడిగా ప్యాకెట్‌లో నింపిన పాలను మళ్ళీ వేడి చేస్తే అందులోని పోషకాలు నాశనం అవుతాయి. పాలలో ఉండే విటమిన్ బి12 మన శరీరానికి శక్తినిస్తుంది. దాన్ని వేడి చేసే కొద్దీ నాశనం అవుతుంది.
 

పచ్చి పాలలో క్రిప్టోస్పోరిడియం, క్యాంపిలోబాక్టర్, బ్రూసెల్లా, లిస్టేరియా వంటి హానికర బ్యాక్టీరియాలు ఉంటాయి. వేడి చేసి తాగితే ఇవి నాశనం అయి, పాలు సురక్షితం అవుతాయి. రోజూ పాలు తాగేవాళ్ళు ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు. కాస్త గోరువెచ్చగా చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. 

పాల ప్యాకెట్ మీద ఆ పాలను ఎలా వాడాలి అని రాసి ఉంటుంది.. దాని ప్రకారం మాత్రమే ఆ పాలను వేడి చేసుకోవాలి. కొన్నింటిని మరిగించకుండా, వేడి చేస్తే సరిపోతుంది.

Latest Videos

click me!