మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం అనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన అలవాట్లు బాగా లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చిన్న ఏజ్ వాళ్లకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణం, జెనెటిక్స్ తో పాటుగా ఇతర కారణాల వల్ల చిన్న వయసులోనే9 తెల్ల వెంట్రుకలు వస్తాయంటున్నారు నిపుణులు. తెల్ల వెంట్రుకలు రావడానికి కొన్ని కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్మోకింగ్
స్మోకింగ్ క్యాన్సర్ తో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇది కూడా జుట్టు తెల్లబడటానికి కారణమవుతుంది తెలుసా? పొగాకులో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు జుట్టులోని మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలను గాయపరుస్తాయి. దీనివల్ల జుల్లు తెల్లబడటం మొదలవుతుంది.
ఒత్తిడి
ఒత్తిడి చిన్న సమస్యగా కనిపించినా ఇది కూడా ఎన్నో ఎన్నో ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్, ఇతర హార్మోన్లు జుట్టు పనితీరు, రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. అలాగే జుట్టు తెల్లబడటానికి కూడా కారణమవుతుంది.
నిద్రలేమి
చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి వల్ల ఆరోగ్యం బాగా పాడవుతుంది. వీటిలో ఒకటి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం ఒకటి. నిద్రలేమి సమస్య ఉంటే హాస్పటల్ కు చూపించుకోవడం మంచిది.
పోషకాహార లోపం
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు పుష్కలంగా ఉండాలి. పోషకాలు లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీ శరీరంలో విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఇ, రాగి, జింక్ వంటి పోషకాలు లోపిస్తే కూడా చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం మొదలవుతుంది.
పేలవమైన జుట్టు సంరక్షణ
జుట్టు సంరక్షణ సరిగ్గా లేకుంటే జుట్టు డ్రైగా మారడం, ఊడిపోవడంతో పాటుగా ఇతర జుట్టు సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఇది మీ జుట్టు తెల్ల బడటానికి కూడా కారణమవుతుంది. కెమికల్ షాంపూలను ఎక్కువగా వాడటం, ఎక్కువ వేడి వల్ల కూడా తెల్ల జుట్టు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.