పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వులో ఎన్నిరకాలో.. తెలుసుకుంటే తగ్గించుకోవడం ఈజీ..

First Published Jul 26, 2021, 2:16 PM IST

బెల్లీఫ్యాట్ ఏ టైపో తెలుసుకుంటే.. దాన్ని బట్టి.. ఆ కొవ్వును కరిగించే దిశగా  చర్యలు తీసుకోవచ్చు. తదనుగుణంగా డైట్ లో మార్పులు, వ్యాయామాలు చేయవచ్చు.

బెల్లీ ఫ్యాట్.. పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు.. ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. ఎంత మంచి ఫ్యాషనబుల్ బట్టలు వేసుకున్నా.. దీనివల్ల వాటి అందం చెడిపోతుంది. దీంతోపాటు ఆరోగ్య సమస్యలూ అనేకం వస్తాయి.
undefined
బొడ్డు చూట్టూ పేరుకుపోయే కొవ్వు విషయానికి వస్తే ఇది విసెరల్ లేదా సబ్కటానియస్ కొవ్వు కావచ్చు. విసెరల్ కొవ్వులు మనిషిలోని అవయవాల చుట్టూ పేరుకుపోతాయి. దీనివల్ల చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. సబ్కటానియస్ కొవ్వులు చర్మం కింద ఉంటాయి. ఈ రెండింటినీ పోల్చితే రెండవదానికంటే మొదటిది ఎక్కువ హానికరం.
undefined
అందుకే మీ బెల్లీఫ్యాట్ ఏ టైపో తెలుసుకుంటే.. దాన్ని బట్టి.. ఆ కొవ్వును కరిగించే దిశగా చర్యలు తీసుకోవచ్చు. తదనుగుణంగా డైట్ లో మార్పులు, వ్యాయామాలు చేయవచ్చు.
undefined
స్ట్రెస్ బెల్లీ.. ఒత్తిడి వల్ల పొట్టప్రాంతంలో పెరగడం. ఇది కార్టిసాల్ స్థాయిల పెరుగుదల వల్ల వస్తుంది, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఇది ఉదర ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వు పెరుగుదలకు దారితీస్తుంది, దీనివల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.
undefined
మరి ఈ రకమైన బెల్లీని తగ్గించుకునేదెలా? అంటే స్ట్రెస్ బెల్లీ తగ్గించుకోవడానికి ధ్యానం,యోగా బాగా పనిచేస్తాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గిస్తాయి. దీంతోపాటు తగినంత నిద్ర పోవాలి. దీనివల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
undefined
హార్మోనల్ బెల్లీ : హార్మోన్ల అసమతుల్యత కారణంగా హార్మోనల్ బెల్లీ ఏర్పడుతుంది. హైపర్ థైరాయిడిజం నుండి పిసిఒఎస్ వరకు, అనేక హార్మోన్ల మార్పులు, అవకతవకలు బరువు పెరగడానికి దారితీస్తాయి. బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.
undefined
దీనికి రెమెడీ ఏంటీ? : హార్మోన్లవల్ల ఏర్పడే పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోవాలంటే ఏకైక మార్గం హార్మోన్ల సమతుల్యతను కొనసాగించడం. అనారోగ్యకరమైన ఆహారం తక్కువగా తీసుకోవాలి. దీనికి బదులుగా అవోకాడోస్,నట్స్, చేపలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు దొరికే ఆహారాలు తీసుకోవాలి. వ్యాయామం చేయాలి, ఆరోగ్యకరమైన బరువులో ఉండాలి. హార్మోన్ల మార్పులను నియంత్రించడం కష్టమైతే డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి వెనుకాడకూడదు.
undefined
లో బెల్లీ : ఎగువ శరీరం ఉదర ప్రాంతం అయిన వారి కడుపు కన్నా సన్నగా ఉన్నప్పుడు, దానిని లో బెల్లీ అంటారు. దీనికి కారణం జీర్ణ సంబంధ సమస్యలు లేదా నిశ్చల జీవనశైలి కారణమవుతాయి.
undefined
దీన్ని ఎలా వదిలించుకోవాలి అంటే : లో బెల్లీ ఉన్నవరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగండి. ఆకుకూరలు తినాలి. కోర్ వ్యాయామాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే మీ లో బెల్లీ తగ్గే అవకాశం ఉంటుంది.
undefined
బ్లోటెడ్ బెల్లి : సరైన ఆహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల ఆహారాలు మీకు పడకపోవడం వల్ల బ్లోటెడ్ బెల్లీ సమస్య వస్తుంది. అసిడిటీ, అజీర్ణం, తరచుగా ఉబ్బరం కలుగుతుంటుంది. ఇది పునరావృతమవుతుంది.
undefined
దీన్నుండి నివారణకు : బ్లోటెడ్ బెల్లి నివారణకు ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. మీ కడుపుకు అనువైన మంచి ఆహారాన్ని ఆశ్రయించడం. ఫిజీ డ్రింక్స్, ఎక్కువ మొత్తంలో ఆహారం ఒకేసారి తినడం లాంటి వాటికి దూరంగా ఉండాలి.
undefined
మమ్మీ బెల్లీ : పిల్లల తల్లుల్లో బెల్లీ కనిపించడం మామూలే. డెలివరీ అయిన తరువాత కూడా కడుపుతో ఉన్నట్టుగా కనిపించడమే మమ్మీ బెల్లీ. ప్రసవం తరువాత స్త్రీ శరీరం తిరిగి యదాస్థితికి వెడుతుంది. ఒకవేళమీరు డెలివరీ అయి కొద్ది సమయమే అయితే దాని గురించి ఒత్తిడి లేకుండా, ఓపికపట్టండి.
undefined
దీన్నెలా ఒదిలించుకోవాలి : మీకు మమ్మీ బెల్లీ ఉన్నప్పుడు, ఒత్తిడికి గురికావద్దు, బదులుగా తగినంత విశ్రాంతి తీసుకోండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. దీనికోసం నట్స్, ఆలివ్ ఆయిల్, అవోకాడోస్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి. చర్మాన్ని బిగుతుగా చేయడానికి కెగెల్ వ్యాయామాలను కూడా ప్రయత్నించవచ్చు.
undefined
click me!