T20 World Cup 2024 - KL Rahul : టీ20 ప్రపంచ కప్ 2024 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్‌జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్టును ప్రకటించారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు టీ20 ప్రపంచకప్ 2024 భారత టీమ్ లో చోటుదక్కలేదు.
India T20 World Cup 2024 squad : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 భారత జట్టులో తప్పకుండా ఉంటారనున్న ఇద్దర ప్లేయర్లకు షాకిచ్చింది బీసీసీఐ. అందులో ఒకరు ఓపెపర్, యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ కాగా, మరోకరు టీమిండియాకు ఒంటిచేత్తో చాలా మ్యాచ్ లలో విజయాన్ని అందించిన స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్. శుభ్‌మన్ గిల్ ప్రధాన జట్టులో లేడు కానీ రిజర్వులో ఉన్నాడు, కానీ కేఎల్ రాహుల్ జట్టులోకి తీసుకోకపోవడంతో అభిమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కేఎల్ రాహుల్ కు మద్దతుగా స్వరం వినిపిస్తున్నారు.
అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ మెగా ఈవెంట్ భారత జట్టులో లేడు.. రిజర్వు ప్లేయర్ల లిస్టులో కూడా లేడు. ఐపీఎల్ లో కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అలాగే, ఐపీఎల్ 2024 లో 400 పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ కేఎల్ రాహుల్ ను బీసీసీఐ విస్మరించింది. ఈ నిర్ణయం తర్వాత రాహుల్‌కు మద్దతుగా అభిమానులు, ప్రముఖులు గళం విప్పుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ నుండి మద్దతు లభించింది.
ఎక్స్ వేదికగా కేఎల్ రాహుల్ కు మద్దతు తెలిపిన రితేష్ దేశ్ ముఖ్.. కేఎల్ రాహుల్ టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉండాలని పేర్కొన్నాడు. రితేష్ తో పాటు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు కూడా కేఎల్ రాహుల్ కు మద్దతు ప్రకటించారు.
KL Rahul should have been there in the squad.
— Riteish Deshmukh (@Riteishd)
ఇదిలావుండగా, తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లక్నో జట్టు ముంబై ఇండియన్స్ ను చిత్తుచేసింది. మార్కస్ స్టోయినిస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఏకనా క్రికెట్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో ప్రారంభంలోనే పోరాడి మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది, అయితే స్టోయినిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో లక్నో కు విజయాన్ని అందించాడు.
KL RAHUL : టీ20 వరల్డ్ కప్ జట్టులోకి కేఎల్ రాహుల్ ను ఎందుకు తీసుకోలేదు?