బరువు తగ్గాలని కార్భోహైడ్రేట్లను తక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

First Published Jan 3, 2023, 9:55 AM IST

కార్భోహైడ్రేట్లు బరువును మరింత పెంచేస్తాయని చాలా మంది  అనుకుంటారు. కార్భోహైడ్రేట్లను తక్కువగా తీసుకుంటే బరువు పెరగరు అనేది నిజమే కానీ.. మరీ ఎక్కువగా తగ్గిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలొస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. 

Low-Carb Diet

బరువు తగ్గడం అంత సులువైన పని కాదు. దీనికోసం రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. కొన్ని రకాల ఆహారాలను అసలే తినకూడదు. ముఖ్యంగా వెయిట్ లాస్ కు సహాయపడే ఆహారాలను ఖచ్చితంగా తినాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించినా... ఫాస్ట్ గా బరువు తగ్గే అవకాశం ఉండదు. కానీ నిదానంగా అయినా బరువు తగ్గడం మాత్రం పక్కా.. అయితే బరువు తగ్గాలని చాలా మంది కార్భోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని బాగా తగ్గిస్తారు. నిజానికి కార్భోహైడ్రేట్లు మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. మన  శరీరం బాగా పనిచేయడానికి ఇది చాలా చాలా అవసరం. ఈ కార్భ్ ను తీసుకోవడం తగ్గిస్తే మీరు బరువు తగ్గుతారనేది నిజమే. కానీ మరీ ఎక్కువగా తగ్గిస్తే మాత్రం ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Low-Carb Diet

పోషకాహార నిపుణుల ప్రకారం.. బరువు తగ్గడానికని కార్భోహైడ్రేట్లను తక్కువగా రోజుకు 60, 130 మధ్యలొ తీసుకుంటారు. కీటోజెనిక్  ఆహారంలో 30 గ్రాముల కార్భోహైడ్రేట్ల కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇందులో కార్భోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని మొత్తమే తీసుకోకపోవడం లేదా చాలా తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. వీటిలో చాలా రకాల ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, రొట్టె, స్వీట్లు, పాస్తా, పిండి కూరగాయలు ఉంటాయి. కాగా వీటిని మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, పిండి లేని కూరగాయలు, కాయలు, విత్తనాలతో భర్తీ చేస్తారు. 

అయితే ఈ ఆహార మార్పును మీ శరీరం సర్దుబాటు చేయడానికి కొంత సమయం పడుతుంది. నిజానికి కొత్త ఆహార పద్దతులు దీర్ఘకాలికంగా పనిచేయకపోవచ్చు. అసలు కార్భోహైడ్రేట్లను తక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆందోళన, తలనొప్పి

కార్భోహైడ్రేట్లను మరీ తక్కువగా తీసుకోవడం వల్ల ముందుగా వచ్చే సమస్యల్లో తలనొప్పి ఒకటి. ఎందుకంటే మన మెదడు గ్లూకోజ్ పనిచేసేలా చేస్తుంది. అలాగే శక్తి కోసం కీటోన్ లకు మారడానికి ముందు గ్లూకోజ్ చివరి నిల్వలను కూడా ఉపయోగిస్తుంది. అయితే మన మెదడు ఈ పనుల కోసం ప్రత్యామ్నాయ శక్తి వనరులను ఉపయోగించడంపైనే దృష్టి పెడుతుంది. అందుకే తక్కువ కార్భోహైడ్రేట్లను తీసుకునే వ్యక్తులు ఆందోళన, తలనొప్పితో బాధపడతారు. పిండిపదార్థాలు సెరోటోనిన్, డోపమైన్ వంటి మంచి రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. తక్కువ కార్భ్ ఆహారాలు మూడ్ ను మారుస్తాయి. 
 

బలహీనత, అలసట

మన శరీరానికి ఇందన వనరు పిండి పదార్థాలు. మన శరీరంలో ఈ కార్బ్ తక్కువ మొత్తంలో ఉంటే ఒంట్లో శక్తి తక్కువగా ఉంటుంది. దీనివల్ల అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు మీరు తక్కువ కార్భ్ ఆహారం తీసుకున్న మొదట్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే మీ శరీరం కొత్త ఆహారానికి అనుగుణంగా ఉండటానికి కొంత సమయం పడుతుంది. 
 

మలబద్దకం

కార్భోహైడ్రేట్లను మరీ తక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కార్భోహైడ్రేట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, ధాన్యాలను తక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫైబర్ లేకపోతే పేగు కదలికలు సరిగ్గా ఉండవు. 
 

కండరాల తిమ్మిరి

కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే తృణధాన్యాల్లో పొటాషియం, కాల్షియం, సోడియం వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కండరాల సరైన పనితీరుకు ఇవి చాలా అవసరం. వీటిని తక్కువగా తీసుకుంటే మాత్రం కండరాల తిమ్మిరి, గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. 
 

దుర్వాసన

కార్బోహైడ్రేట్లను తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలో నోటి దుర్వాసన కూడా ఒకటి. ఎందకు తక్కువ కార్భోహైడ్రేట్ల ఆహారం తింటే.. మీ శరీరం పనిచేయడానికి అవసరమైన  శక్తిని పొందడానికి గ్లైకోజెన్ ను పొందలేకపోతుంది. కీటోన్లకు మారుతుంది. ఈ కీటోన్లు మూత్రవిసర్జన ద్వారా బయటకు వెళతాయి. దీనివల్ల నోట్లో చెడు వాసన వస్తుంది.  

click me!