పాలు తాగితే బరువు పెరుగుతారా? డైటింగ్ చేసేప్పుడు పాలు దూరం పెట్టాలా?

First Published Nov 6, 2021, 11:51 AM IST

పాలు ఆరోగ్యకరం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పాలల్లో  కొవ్వు ఉంటుంది. ఈ పాలలోని కొవ్వు బరువు పెరుగడంతో సంబంధం ఉన్న మాక్రోన్యూట్రియెంట్. కాబట్టి మీరు నిజంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు పాలను మానేయాలా? అనేది సహజంగా ఉదయించే ప్రశ్న. 

డైటింగ్ లో ఉన్న వారికి ఆహారం విషయంలో అనేక అనుమానాలుంటాయి. ఏమి తీసుకోవచ్చు? ఏమి తీసుకోవద్దు? ఏం తింటే బరువు పెరుగుతుంది? లాంటి వాటిమీద అనేక సందేహాలుంటాయి. 

ఇక ముఖ్యంగా పాల విషయానికి వస్తే... ఇది అతి మామూలుగా వేదించే సందేహం. పాలు ఆరోగ్యకరం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పాలల్లో  కొవ్వు ఉంటుంది. ఈ పాలలోని కొవ్వు బరువు పెరుగడంతో సంబంధం ఉన్న మాక్రోన్యూట్రియెంట్. కాబట్టి మీరు నిజంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు పాలను మానేయాలా? అనేది సహజంగా ఉదయించే ప్రశ్న. 

milk

బరువు తగ్గడానికి పాలు మంచిది కాదని ఎందుకు అనుకుంటారంటే...

పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కేలరీలు అధికంగా ఉంటాయి ఈ రెండు అంశాలను బరువు తగ్గే విషయంలో మరిచిపోకూడదు. ఒక కప్పు అంటే 250 mlల పాలలో దాదాపు 5 గ్రాముల కొవ్వు, 152 కేలరీలు ఉంటాయి. అందుకే, ముఖ్యంగా low-calorie dietలో ఉన్నవారు.. రోజుమొత్తంలో తక్కువ క్యాలరీలు తీసుకుంటారు కాబట్టి.. వీరు వారి ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులను నివారించడమే మంచిది.

milk general

పాలతో బరువు పెరుగుతుందా?
ఈ ప్రశ్నకు మామూలుగా చెప్పే సమాధానం NO. పాలు తాగడం వల్ల బరువు పెరగదు. ఇంకా చెప్పాలంటే కాస్తో, కూస్తో బరువు తగ్గడానికే సహాయపడుతుంది. పాలు ఆరోగ్యకరమైనవి. అధిక-నాణ్యత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాల నిర్మాణానికి, కండరాల పెరుగుదలకు అవసరమైన పోషకం. పాలల్లో జింక్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ B12, విటమిన్ D వంటి పోషకాలు కూడా ఉంటాయి. 

milk

ఈ పోషకాలు ఎముకలను బలోపేతం చేయడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. 250 ml పాలలో 8 గ్రా ప్రోటీన్ మరియు 125 mg కాల్షియం ఉంటాయి. కాబట్టి, డైట్‌లో ఉన్నప్పటికీ రోజూ పరిమిత పరిమాణంలో పాలు తీసుకోవడం వల్ల ఎటువంటి హాని ఉండదు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.. 
2004లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, లో-కాలరీ డైట్ ను అనుసరించే వారు.. పాలు, పాల ఉత్పత్తులను దూరం పెట్టడం కంటే... ప్రతిరోజూ మూడు సార్లు పాల ఉత్పత్తులను తీసుకుంటే ఎక్కువ బరువు కోల్పోతారు. 

weight loss diet

డైటింగ్ ను మానేసి.. బరువును మెయింటేన్ చేస్తున్న వారు కూడా పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల మళ్లీ బరువు పెరగరని, వారి నడుం చుట్టు కొలతలో ఎలాంటి తేడా రాకుండా చక్కగా మెయింటేన్ చేయగలుగుతున్నారని అనేక ఇతర అధ్యయనాల్లో తేలింది.  

అంతేకాకుండా, కాల్షియం తీసుకోవడం వల్ల ఊబకాయం, మెటబాలిక్ సిండ్రోమ్, టైప్ -2 మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... 
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించాల్సిన అవసరం లేదు. పాలు సమతుల్య ఆహారంలో భాగం. ప్రతిరోజూ ఒక కప్పు పాలు లేదా 250 ml పాలు మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. 

వ్యాయామం తర్వాత ప్రోటీన్ షేక్ తీసుకుంటే, దానిని పాలలో కలిపి తాగండి. ఒక వేళ లాక్టోస్ మీకు పడకపోతే...పాలను మానేయచ్చు. అలాంటి సందర్భాల్లో సోయా పాలు, nut milk లాంటి మొక్కల ఆధారిత పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు.

Healthy Weight Loss : వారంలో ఎంత బరువు తగ్గాలి..?

click me!