అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్.. డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్న ఐకాన్‌ స్టార్‌?

By Aithagoni RajuFirst Published Apr 30, 2024, 5:47 PM IST
Highlights

బన్నీ ప్రస్తుతం `పుష్ప2`లో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించి పిచ్చెక్కించే వార్త వైరల్‌ అవుతుంది. 
 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం దేశం అంతా వెయిట్‌ చేస్తుంది. పుష్పరాజ్‌గా  విశ్వరూపం చూపించేందుకు ఆయన రెడీ అవుతున్నారు. మొదటి పార్ట్ లో కంటే రెండో పార్ట్ లో కథ మరింత పెద్దగా, మరింత భారీ స్థాయిలో ఉండబోతుంది. లార్జ్ స్కేల్‌లో దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేశాడు. అంతేకాదు ఇందులో బన్నీ అమ్మోరుగా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లోనూ ఆ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఇది సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 15న రాబోతుంది.

`పుష్ప2` తర్వాత బన్నీ ఇద్దరు దర్శకులకు కమిట్‌ అయ్యాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందనేది పెద్ద సస్పెన్స్. చాలా వరకు అట్లీ సినిమా ప్రారంభమవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించిన వార్తలు తరచూ వైరల్‌ అవుతున్నాయి. ఈ మూవీ కోసం బన్నీ ఏకంగా 120కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని, అట్లీ అరవై కోట్లు అడుగుతున్నట్టు సమాచారం. 

అయితే త్రివిక్రమ్‌తోనూ సినిమా ఉంటుందని ఇటీవల బన్నీ బర్త్ డే రోజున ప్రకటించారు. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసినీ దీన్ని నిర్మించనుంది. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది సస్పెన్స్. నెక్ట్స్ త్రివిక్రమ్‌ సినిమానే అనే టాక్‌ కూడా ఉంది. మరోవైపు రెండో పారలల్‌గా షూట్‌ చేస్తారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. ఇందులో బన్నీ పాత్రకి సంబంధించిన ఒక సంచలన వార్త వైరల్‌ అవుతుంది. 

మాటల మాంత్రికుడి సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. డ్యూయెల్‌ రోల్‌లో కనిపిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఇదే నిజమైతే మాత్రం అది మామూలు రచ్చ కాదు. బన్నీ కెరీర్‌లోనే మొదటి సారి ఆయన డ్యూయెల్‌ రోల్‌ పోషించే సినిమా అవుతుంది. సరికొత్త రికార్డు క్రియేట్‌ చేస్తుంది. ఇలాంటి అరుదైన దృశ్యం మాటల మాంత్రికుడి వల్లే సాధ్యమైనందని చెప్పొచ్చు. త్రివిక్రమ్‌ రూపొందించిన సినిమాల్లోనూ హీరో సింగిల్‌ రోల్లోనే కనిపించారు. ఆయన కెరీర్‌లోనూ ఇది మొదటి సారి అవుతుందని చెప్పొచ్చు.  ఇది నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

click me!