Uses of walking: ఈ నడకే మనకు శ్రీరామ రక్ష.. దీని వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

First Published Jan 22, 2022, 12:52 PM IST

Uses of walking: కరోనా రాకతో మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అందులోనూ ఈ మహమ్మారి మన ఆరోగ్యాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. బయటకు వెళ్లి ప్రశాంతంగా గడపడానికి వీలు లేకుండా చేసింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లి వర్క్ చేయలేని పరిస్థితులను తీసుకొచ్చింది. దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్ లు, ఆన్ లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. వీటి వల్ల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వచ్చింది. 

Uses of walking: కరోనా రాకతో మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అందులోనూ ఈ మహమ్మారి మన ఆరోగ్యాన్ని పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంది. బయటకు వెళ్లి ప్రశాంతంగా గడపడానికి వీలు లేకుండా చేసింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లి వర్క్ చేయలేని పరిస్థితులను తీసుకొచ్చింది. దాంతో వర్క్ ఫ్రమ్ హోమ్ లు, ఆన్ లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. వీటి వల్ల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఉండి వర్క్ చేయడం వల్ల మన ఆరోగ్యం విషయంలో కేరింగ్ పూర్తిగా తగ్గిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మంచి నడకను అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు 10 వేల అడుగులే మనకు అన్ని రకాల రోగాల నుంచి కాపాడే శ్రీరామ రక్ష అని వైద్యనిపుణులు చెబుతున్నారు. మరి ఇలా నడిస్తే కలిగే ఉపయోగాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

 ఉరుకుల పరుగుల జీవితానికి నడక వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో రోజుకు కేవలం ఒక 5 కిలోమీటర్ల నడక ఎంతో అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 5 కిలోమీటర్ల నడకతో దాదాపుగా 10 వేల అడుగుల నడిచినవారవుతారు. ఈ నడకను అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ నడక మన ఆరోగ్యాన్ని నిర్ధేశించే దిశ కాబట్టి. అయితే ఈ పదివేల అడుగుల్లో ఏడు వేల అడుగులు మామూలుగా నడిచి, మరో మూడు వేల అడుగులను జాగింగ్ లేదా బ్రిస్క్ వాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే బుజాలను వంచకుండా, ఛాతిని విశాలంగా పెట్టి నడవాలన్న మాట. 

 నడక మనల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా బలంగా చేస్తుంది. మంచి నడక వల్ల మెదడు ఉత్తేజంగా మారుతుంది. మెదడులో గూడు కట్టుకున్న పాత ఆలోచనలకు స్వస్తి పలికి, కొత్త ఆలోచనలు రావడానికి మార్గం చూపుతుంది. అంతేకాదు మనసులో సుడిగుండాల్లా  తిరిగే చాకాకు, అనవసరపు ఆందోళనను కూడా దూరం చేస్తాయి. Creativity కూడా పెరుగుతుంది. అందుకే  Creativity ఫీల్డ్ లో ఉన్నవాళ్లు ఈ నడకను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 

వ్యాపారాల్లో, ఉద్యోగంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. వాటి మూలంగా నిరాశ, ఆందోళనలు కలగడం సహజం. కానీ ఈ చికాకులే మానసికంగా మనల్ని బలహీనుల్ని చేస్తాయి. అయితే నడకతో ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యనుంచి బయటపడాలంటే మామూలు నడక కాదు పరుగులా లాంటి నడక నడవాలన్న మాట. ఈ నడక నడుస్తున్నప్పుడు ఒక పాదం భూమ్మీదుంటే మరో పాదం గాల్లో ఉండాలి. ఇలా నడుస్తున్నప్పుడు పూర్తిగా మీ ధ్యాస మొత్తం నడకమీదే ఉంచాలి. ఒక్క పదినిమిషాలు ఇలా చేస్తే మీకున్న ఆందోళనలు, చికాకు పూర్తిగా పోతుంది. ముఖ్యంగా ఇలా నడిస్తే మీ Body comfort గా ఫీలవుతుంది. ప్రతి రోజూ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది. 

 నడక వల్ల బాడీలోని ప్రతి భాగానికి Blood supply మెరుగ్గా జరుగుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు నడక ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ నడకే Heart beating ను నిర్ధారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ నడవడం వల్ల గుండెకు రక్తం సరఫరా చేసే పని కూడా చాలా సులువుగా జరుగుతుంది. 

నడుస్తున్నప్పుడు శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండ గ్లూకోజ్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఫలితంగా మన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు మోతాదులోనే ఉంటాయి. దీనివల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అవసరానికి మించి చేరవన్నమాట. అంతేకాదు ప్రతి రోజూ నడవడం వల్ల అధిక బరువును కూడా ఈజీగా కోల్పోవచ్చు. ఒబేసిటీ సమస్య కూడా దరిచేరదు. అందుకే ఎలాంటి ఆనారోగ్య సమస్యలున్న వారు కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నడవాలని ఆరోగ్య నిపుణులు చూసిస్తున్నారు. 
 
 

click me!