వర్జినిటీ పిల్స్ ఫస్ట్ నైట్ కి ఎలా ఉపయోగపడతాయో తెలుసా?

First Published Jan 7, 2023, 10:50 AM IST

నిజానికి కన్యత్వాన్ని కోల్పోవడం ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలా మంది సెక్స్ లో పాల్గొంటేనే కన్నె పొర చిరిగిపోతుందని అనుకుంటారు. కానీ దీనిలో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. దీనిపై ఎంత అవగాహన కల్పిస్తున్నా.. సమాజంలో దీనిపై ఉన్న అభిప్రాయం మాత్రం నేటికీ మారడం లేదు. 

ఇంతకు ముందెప్పుడూ సెక్స్ లో పాల్గొనకపోవడాన్నే కన్యత్వం అంటారు. ఇది అన్ని లింగాల వారికి వర్తించదు. ఒక్క ఆడవారికే  ఇది వర్తిస్తుంది. మునుపెన్నడూ లైంగిక సంబంధం పెట్టుకోని వారినే కన్య అంటారు. నిజానికి ఈ కన్యత్వాన్ని ఎన్నో కారణాల వల్ల కోల్పోవాల్సి ఉంటుంది. కానీ సమాజంలో ఉండే చాలా మంది మాత్రం ఒక్క సెక్స్ ద్వారే కన్యత్వం కోల్పోతారని భావిస్తారు. మీకు తెలుసా? పెళ్లికి రెడీ అయినవాళ్లు చాలా మంది ఆడవారికి వర్జినిటీ టెస్ట్ లను చేయిస్తుంటారు. ఆమె వర్జినిటీ కాదు అని తెలిస్తే.. పెళ్లిళ్లను క్యాన్సిల్ చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఒక సన్న కొన్నె పొర చిరిగిపోయినంత మాత్రాన వారు కన్నెలు కాకుండా పోరు.. వారు సెక్స్ లో పాల్గొన్నట్టూ కాదు.. అని ఎంతో మంది నిపుణులు జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ చాలా మంది ఇలాంటి విషయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. 

ఎన్నో కల్చర్  లల్లో.. సెక్స్ తర్వాత ఆమె యోని నుంచి రక్తం రాకపోతే ఆమె కన్య కాదు.  యోని ప్రారంభంలో చిన్న, సన్నని కణజాలం ఉంటుంది. అది లైంగిక కార్యకలాపాల వల్ల విచ్చన్నమయ్యి రక్తం బయటకు వస్తుంది. సెక్స్ లో పాల్గొన్నంత మాత్రానా రక్తం బయటకు రావడం అనేది ముఖ్యం కాదంటున్నారు నిపుణులు. నిజానికి బైక్ రైడింగ్, జిమ్నాస్టిక్స్, టాంపోన్ వాడకం, గాయం, సైక్లింగ్ వంటి వివిధ లైంగికేతర కార్యకలాపాల వల్ల ఇది చిరిగిపోతుంది.

ఇలాంటి సంఘటనల మధ్య కన్యత్వ మాత్రలు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. ఇది సెక్స్ సమయంలో హైమెన్ విచ్చిన్నమైనట్టుగా నకిలీ రక్తాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. ఈ మాత్రలు ఆమె గర్భాశయంలో నకిలీ రక్తాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి మాత్రలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కన్యత్వ సమస్యతో బాధపడేవారికి ఇది ఊరటకలిగించే విషయం. కానీ ఈ మూత్రపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.. 

అయ్యో.. ఈ ఉత్పత్తితో కూడా ఎవరు ముందుకొచ్చారు? భయంకరంగా ఉంది.. అంటూ ఓ నెటిజన్ స్వీట్ చేశాడు.

వావ్.. ఇది భారతీయ పితృస్వామ్యాన్ని, మత దురభిమానాన్ని మరో స్థాయికి తీసుకెళుతోంది' అని మరొకరు పేర్కొన్నారు.

ఈ మాత్రలకు మద్దతుగా మరో వ్యక్తి ఇలా రాశాడు.. ‘స్త్రీ తనకు జరిగే వివక్షతను తప్పించుకోవడానికి ప్రయత్నించే అన్ని మోసాలకు నేను మద్దతునిస్తున్నాను. ఈ మాత్రలనే కాదు మరిన్ని ఉత్పత్తులను కూడా స్వాగతిస్తాను. ఈ కంపెనీకి అభినందనలు’ అని అన్నారు. 
 

ఈ పిల్స్ ఆన్లైన్ లో 2,700 నుంచి 3,600 రూపాలయ  వరకు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవట. దీనిలో అధిక నాణ్యతున్న రక్తపొడి, ఫస్ట్ నైట్ కోసం నకిలీ రక్తం ఉంటాయి. ఇవి ప్రమాదకరమైనవి కావు. ఇది చాలా సులభమైంది. వేగవంతమైంది. సురక్షితమైంది, సౌకర్యవంతమైంది కూడా. 

ఒక ప్రసిద్ధ భారతీయ ఆన్ లైన్ ఫార్మసీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇలాంటి మాత్రల గురించి ఇలా ఉంది.. ఈ మాత్రలు సింథటిక్ రక్తం కలిగి ఉంటాయి. ప్రమాదం, గాయాలు, భారీ వ్యాయామం, జిమ్నాస్టిక్స్, ఈత, సంభోగం వంటి వివిధ కారకాల వల్ల కన్యత్వం కోల్పోతారు. ఈ మాత్రలు సంభోగం సమయంలో రక్త నష్టాన్ని ప్రేరేపిస్తాయి. వీటి వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. ఇవి పూర్తిగా సహజమైనవి.  
 

click me!