మష్రూమ్ మంచూరియా ఇంట్లోనే ఇలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోండి!

First Published Nov 6, 2021, 7:40 PM IST

మష్రూమ్ మంచూరియా పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ (Snack). ఈ ఆర్టికల్ (Article) ద్వారా ఎంతో రుచికరమైన టేస్టీ మష్రూమ్ మంచూరియా విధానాన్ని ఎంతో సులభంగా, ఏ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
 

కావలసిన పదార్థాలు:  ఒక ప్యాకెట్ మష్రూమ్ (Mushroom), 2 టేబుల్ స్పూన్లు మైదా (Maida), రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్  (Cornfloor), ఢీ ఫ్రైకి సరిపడా నూనె (Oil), రెండు పచ్చిమిరపకాయలు (Green chilli), రెండు ఉల్లిపాయలు (Onion), ఒక టీస్పూన్ అల్లం వెల్లులి ముక్కలు (Ginger gerlic paste), ఒక టేబుల్ స్పూన్ టమోటో సాస్ (Tomato sauce).
 

ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ (Soya sauce), సగం టేబుల్ స్పూన్ వెనిగర్ (Veniger), ఒక టేబుల్ స్పూన్ చైనీస్ చిల్లీసాస్ (Chinese chilli sauce), సరిపడు ఉప్పు (Salt), సగం టేబుల్ స్పూన్ మిరియాల పొడి (Pepper powder), ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ కాడల తరుగు (Spring onions), కొత్తిమీర (Coriander).
 

తయారీవిధానం: ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్ ను తీసుకుని పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ ల మైదా (Maida), రెండు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Corn Floor), సరిపడ ఉప్పు, కారం, కొన్ని నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బాండ్లీలో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇలా వేడి చేసుకున్నా నూనెలో ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసి ఢీ ఫ్రై చేసుకోవాలి.
 

లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. మరొక బాండ్లీలో రెండు టేబుల్ స్పూన్ ల నూనె(Oil) వేసి రెండు పచ్చిమిర్చి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ ల తరిగిన ఉల్లిపాయలు, ఒక టీస్పూన్ అల్లం తరుగు వేసి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ టమోటా సాస్, ఒక టేబుల్ స్పూన్ సోయాసాస్, సగం టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ చైనీస్  చిల్లీసాస్, కొన్ని నీళ్ళు (Water) వేసి ఉడికించాలి.
 

రెండు నిమిషాల తర్వాత సరిపడా ఉప్పు (Salt), సగం టేబుల్ స్పూను మిరియాల పొడి (Pepper powder) వేసి కలపాలి. తరువాత ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా కలపాలి. దింపేముందు రెండు టేబుల్ స్పూన్ ల ఉల్లికాడల తరుగు, కొత్తిమీర (Coriyander) వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
 

దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని టమోటా సాస్ తో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన మష్రూమ్ (Mushroom) మంచూరియా రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి వారికి ఎంతగానో నచ్చుతుంది. ఇది ఒక మంచి ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.దీన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని టమోటా సాస్ తో సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన మష్రూమ్ (Mushroom) మంచూరియా రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి వారికి ఎంతగానో నచ్చుతుంది. ఇది ఒక మంచి ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.

click me!