వారంలో ఒకసారి ఇలా చేస్తే చాలు.. ముండి చుండ్రు మాయం?

First Published Oct 26, 2021, 8:29 PM IST

చాలామంది తమ అందం విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా జుట్టు (Hair) సంరక్షణలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంటారు. కానీ అందులో ఎక్కువగా చుండ్రు (Dandruff) సమస్య అనేది ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. కాబట్టి ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే చుండ్రు సమస్య నుండి బయటపడటం.
 

చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ (Fungal Infection). కలుషిత వాతావరణం, దుమ్ము ధూళి, అధిక రసాయనిక పదార్థాలు వాడడం వంటి కారణాలతో చుండ్రు సమస్య వస్తుంది. చుండ్రు అనేది చాలా చిన్న సమస్య అయినప్పటికీ ఇది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అధిక ఒత్తిడి (Stress) వల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉంది.
 

చుండ్రుతో దురదలు రావడం (Itching), జుట్టురాలడం, మొటిమలు (Pimples) వంటి సమస్యలు వస్తాయి. రోజు తల స్నానం చేసినా, షాంపూలను వాడిన ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ చుండ్రు సమస్య నుండి బయట పడటానికి ఓసారి ఇలా ప్రయత్నిస్తే చాలు.
 

మందారం (Hibiscus) పువ్వు, ఆకులు చుండ్రును తగ్గించడానికి మంచి ఔషధంగా (Medicine)  ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం మందారంతో చుండ్రు సమస్యలను తగ్గించుకోవడానికి తయారు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.
 

10 మందారం ఆకులు,10 మందారం పువ్వులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జును (Aloe vera) తీసుకోవాలి. ఇప్పుడు మందార ఆకులు, మందార పువ్వులు, మూడు టీ స్పూన్ల కలబంద గుజ్జును కలిపి మిక్సీలో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. వీటితో పాటు ఒక గుడ్డులో (Egg) తెల్లని పదార్థాన్ని వేయాలి. ఒక వేళ గుడ్డు లేకపోతే పుల్లటి పెరుగు (Curd) తీసుకోవచ్చు.
 

ఇప్పుడు వీటన్నింటిని మెత్తని పేస్ట్ (Paste) లా తయారు చేయాలి. ఈ పేస్ట్ ను తల పై మాడుకు, జుట్టుకు (Hair) కుదుళ్లకు బాగా అప్లై చేయాలి. అప్లై చేసిన గంట తర్వాత  ఎక్కువ గాఢత లేని షాంపుతో స్నానం చేయాలి.
 

ఇలా వారంలో ఒక్కసారి చేస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా తెల్లజుట్టు (White Hair) త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది. తెల్లజుట్టు ఉన్నా న‌ల్ల‌గా (Black hair) మారుతుంది. హెయిర్ ఫాల్ స‌మ‌స్య త‌గ్గి, జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.

click me!