కూర్గ్‌ లో సందర్శించవలసిన ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

First Published Dec 2, 2021, 3:48 PM IST

భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్ (Hill station) లను కలిగిన ప్రాంతం కూర్గ్. ఇది భారతదేశ స్కాట్లాండ్ (Scotland) గా ప్రసిద్ధి. కూర్గ్ గా పిలువబడే  కొడగు ప్రాంతం ఇది. దక్షిణ కర్ణాటకలోని చాలా సుందరమైన, ఆకర్షణీయమైన పర్వత ప్రాంతం ఇది. ఉత్కంఠభరితమైన దృశ్యాలకు కొరకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు పర్యాటకులకు స్వర్గానుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతం పర్యాటక ప్రియులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా కూర్గ్ లో సందర్శించవలసిన కొన్ని పర్యాటక ప్రదేశాలు గురించి తెలుసుకుందాం..
 

అబ్బే జలపాతం: కూర్గ్‌ సందర్శనకు ఉత్తమమైన ప్రదేశాలలో అబ్బే జలపాతం (Abbey Falls) ఒకటి. ఈ జలపాతాలు కాఫీ తోటల (Coffee plantations) మధ్య ఉన్నాయి. ఈ అందమైన జలపాతాలను సందర్శించడానికి వేల సంఖ్యలో పర్యాటక ప్రియులు వస్తుంటారు. కూర్గ్‌లో అబ్బే లేదా అబ్బి అంటే జలపాతం అని అర్ధం. ఈ జలపాతం ప్రాంతానికి దగ్గరలో ఉండడంతో   పర్యాటకులు సందర్శించడానికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
 

నాగర్‌హొళె జాతీయ ఉద్యానవనం: ఈ ఉద్యానవనం అనేక జాతి రకాలకు చెందిన వృక్షాలను (Trees), జంతుజాలాన్ని కలిగి ఉంటుంది. ఆ కారణంగా నాగర్‍హొళె జాతీయ ఉద్యానవనం (Nagarhole National Park) దేశంలోని అత్యుత్తమ వైల్డ్ లైఫ్ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వృక్షాలతో పాటు 270 జాతుల పక్షులు (Birds) దర్శనమిస్తాయి. కూర్గ్ వెళ్ళినప్పుడు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలలో ఇది ఒకటి.
 

నామ్‌డ్రోలింగ్ ఆరామం: నామ్‌డ్రోలింగ్ ఆరామం (Namdrolling Monastery) గోల్డెన్ టెంపుల్ (Golden Temple) గా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశంగా ఉంది. ఈ ప్రదేశం పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
 

ఓంకారేశ్వర ఆలయం: ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర (Linga Rajendra) నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను (Water pool) ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.   
 

మడికెరి కోట: బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడిన ఈ కోట 17 వ శతాబ్దానికి చెందినది. 1812 - 1814 ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారని చెబుతారు. ఈ కోట ప్రవేశద్వారం (Entrance) చుట్టుపక్కల ఉన్న ఏనుగులు (Elephants) ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. 
 

సోమవారపేట్: సోమవారపేట్ (Somavarapet) తాలూకాలోని ప్రధాన పట్టణం సోమవారపేట్.  ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు,  మిరియాలు తోటలు (Gardens) ఉన్నాయి. ఈ తోటల అందాలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతం.

click me!