చలికాలంలో ఈ సబ్బులు వాడుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో ఇది చూడండి!

First Published Nov 18, 2021, 4:55 PM IST

 మారుతున్న వాతావరణ మార్పులకు తగినట్లుగా చర్మం స్పందిస్తుంది. చలి కాలంలో ఉండే శీతల ఉష్ణోగ్రతలు ఒక్కోసారి చర్మంపై ప్రభావితం చూపుతాయి. చలికాలంలోనీ (Winter season) చల్లని గాలులు చర్మానికి ఇబ్బందిని కలిగిస్తాయి. చలికాలంలో చర్మ సంరక్షణకు (Skin care) తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన చర్మం తాజాగా ఉంటుంది. చలికాలంలో సబ్బుల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చలికాలంలో చర్మ సంరక్షణకు ఏ విధమైన సబ్బులు వాడాలో తెలుసుకుందాం. 
 

చలి తీవ్రతకు ముఖంపై ముడతలు మొదలవుతాయి. చర్మం పొడిబారడమే కాకుండా బిరుసుగా తయారవుతుంది. దాంతో తెల్లగా పొట్టు పోయినట్టుగా కనిపిస్తుంది. మరికొందరికి పెదాల పగుళ్లతో పాటు చర్మ పగుళ్ళు, కాళ్ళపగుళ్ళు ఇబ్బందిని కలిగిస్తాయి. చలి కాలంలో మనం స్నానానికి వాడే సబ్బులు (Soaps) కూడా చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. కనుక సబ్బుల వాడకంలో కూడా తగిన జాగ్రత్తలు అవసరం. చలికాలంలో చర్మ సమస్యలు (Skin problems) వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడతాయి.
 

స్నానానికి మంచి నాణ్యత గల సబ్బులను ఎంచుకోవడం అవసరం. గ్లిజరిన్ (Glycerin) ఎక్కువ శాతం ఉన్న సబ్బులను వాడడం మంచిది. చలికాలంలో రోజుకు సబ్బులు రెండుసార్లు మాత్రమే అప్లై చేసుకోవాలి. చలికాలంలో దొరికే మాయిశ్చరైజర్ క్రీములను వాడకం మంచిది. ఇవి శరీరానికి కావల్సిన తేమను అందించి చర్మం పొడిబారకుండా చూస్తాయి.
 

స్నానం చేసిన వెంటనే వ్యాజలిన్ తో పాటు మన్నికైన కోల్డ్ క్రీమును (Cold creams) అప్లై చేసుకోవడంతో చర్మ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అలాగే ముఖ్యంగా చలికాలంలో చర్మ సమస్యలతో పాటు పెద్దల సమస్య కూడా మరింత ఇబ్బందిని కలిగిస్తాయి.
 

పెదాల పగుళ్లతో బాధపడేవారు రాత్రి నిద్రించే ముందు పెదాలకు వెన్న, నెయ్యి రాసుకోవడం మంచిది. రెండు చెంచాల కొబ్బరి నూనెకు (Coconut oil) సమాన పరిమాణంలో తేనె (Honey) కలిపి ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
 

ఇలా చేయడంతో ముఖానికి కావలసినంత తేమ అందుతుంది దాంతో ముఖం పొడిబారకుండా ఉంటుంది. కొబ్బరినూనెలో  ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ ను స్నానానికి వెళ్లి ముందు శరీర భాగాలకు అప్లై చేయాలి.
 

ఇలా చేయడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. కోడి గుడ్డులోని పచ్చసొనకు (Yolk) బాదం నూనెను (Almond oil) రెండు చెంచాలు కలపాలి. ఈ నూనెను ముఖానికి రాసి బాగా ఆరనిచ్చి కడిగేయాలి. బాదం నూనె లో ఉండే పొటాషియం, జింక్, ప్రోటీన్లు, విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
 

చర్మాన్ని సంరక్షిస్తాయి. అరటిపండు గుజ్జుకు రెండు చెంచాల తేనె కలిపి ముఖానికి పట్టించాలి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

click me!