మందులు వాడకుండా కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..

First Published Oct 1, 2022, 3:26 PM IST

ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి మన శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కానీ ఇది మోతాదుకు మించి శరీరంలో పేరుకుపోతే మాత్రం గుండె జబ్బుల నుంచి ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. 
 

cholesterol

చెడు వర్సెస్ మంచి కొలెస్ట్రాల్

మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. LDL - తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్. దీనినే మనం  'చెడు' కొలెస్ట్రాల్ అంటారు. రెండోది HDL- అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతే గుండె జబ్బులు వస్తాయి. అలాగే స్ట్రోక్ ప్రమాదం కూడా పెరుగుతుంది. HDL ఈ ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెడిసిన్స్ యూజ్ చేయకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం పదండి.
 

ట్రాన్స్ ఫ్యాట్స్ ను తీసుకోవడం మానుకోండి

ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. వీటిలో ప్రాసెస్ చేయబడిన, వేయించిన, చక్కెర ఆహారాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుంది.
 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయడం మరువకండి. అధిక బరువు , ఊబకాయం ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది.  ఈ ప్రమాదాలు తగ్గాలంటే శారీరక శ్రమ తప్పనిసరి. 
 

ఒత్తిడిని తగ్గించుకోండి 

ఒత్తిడి చిన్న సమస్యగా అనిపించినప్పటికీ.. ఇది ఎన్నో ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో ఒకటి అధిక కొలెస్ట్రాల్.  ముందే మీరు అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే..ఈ సమయంలో ఒత్తిడికి గురైతే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించుకుంటేనే మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇందుకోసం ధ్యానం, యోగా చేయండి. 

smoking

స్మోకింగ్ కు  'నో' చెప్పండి

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాలనుకుంటే స్మోకింగ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే స్మోకింగ్ చేయడం వల్ల మీ రక్తంలో LDL లేదా "చెడు" కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అలాగే  HDL లేదా "ఆరోగ్యకరమైన" కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. 
 

పరిమితిలోనే తాగండి 

పరిమితిలో ఆల్కహాల్ ను తాగడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది. ఇంతకు మించి తాగితే మీ కాలేయం దానిని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌గా విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 
 

click me!