అలిసిన కళ్లకు సాంత్వననిచ్చే అద్భుతమైన చిట్కాలు..

First Published Aug 7, 2021, 3:09 PM IST

లాప్ టాప్, టీవీ లేదా మొబైల్ ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలిసిపోతాయి. దీంతోపాటు కనురెప్పలు కొట్టే రేటు తగ్గిపోవడం కూడా కళ్ల అలసటకు దారి తీస్తుంది. దీనివల్ల చూపు మసకబారడం, కళ్లు పొడిబారిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. 

కళ్లు అలిసిపోతున్నాయా? అలసటగా అనిపిస్తుందా? దీంతో చిరాకు, తలనొప్పి వేధిస్తుందా? ఏదైనా చిన్న శబ్దం విన్నా.. ఏకాగ్రతగా ఏదైనా చదవాలన్నా చదవలేకపోతున్నారా? ఇవన్నీ కంటి అలసట లక్షణాలు. కళ్లను ఎక్కువగా ఇబ్బంది పెడితే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.
undefined
ఇబ్బంది పెట్టడం అంటే.. లాప్ టాప్, టీవీ లేదా మొబైల్ ను అదేపనిగా గంటల తరబడి చూస్తూ ఉండడం వల్ల కళ్లు అలిసిపోతాయి. దీంతోపాటు కనురెప్పలు కొట్టే రేటు తగ్గిపోవడం కూడా కళ్ల అలసటకు దారి తీస్తుంది. దీనివల్ల చూపు మసకబారడం, కళ్లు పొడిబారిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
undefined
కళ్లు పెట్టే ఈ చికాకు వల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. పని చేసుకోలేరు. రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. దీనికోసం కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే కళ్ల అలసట తగ్గుతుంది. మళ్లీ ఉత్సాహంగా పనిచేసుకోగలుగుతారు.
undefined
ఫోన్, లాప్ టాప్, టీవీ ఏదైనా సరే మీరు స్క్రీన్ చూసే టైంలో అవి మీ కంటికి కనీస దూరంలో ఉండాలి. అప్పుడే మీ కళ్లు స్ట్రెయిన్ కాకుండా ఉంటాయి. మరీ దగ్గరకు వెళ్లి చూడడం, దగ్గరగా పెట్టుకుని చూడడం వల్ల కళ్ల మీద భారం పడుతుంది. అందుకే మీ కంటికి స్క్రీన్ కి మధ్య 20-25 ఇంచుల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి.
undefined
20-20-20 రూల్ : ప్రతి 20 నిమిషాలకొకసారి పనిలో బ్రేక్ తీసుకోండి. స్క్రీన్ మీదినుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడండి. దీనివల్ల మీ కళ్లు పొడితనం తగ్గి మాయిశ్చరైజ్ అవుతాయి.
undefined
మీ స్క్రీన్ చాలా బ్రైట్ గా ఉండడం.. ఎక్కువ సేపు అలాంటి స్క్రీన్ చూడడం వల్ల మీ కళ్లు బాగా అలసటకు, ఒత్తిడికి గురవుతాయి. అందుకే కళ్ల అలసట తగ్గాలంటే మీ స్క్రీన్ బ్రైట్ నెస్ లెవల్ ను తగ్గించుకుని.. మరీ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా ఉండేలా చూసుకోండి.
కళ్లు పొడిబారిపోయే సమస్యతో బాధపడుతున్నట్లైతే దీనికోసం హ్యుమిడిఫైర్ ను ను వాడొచ్చు. దీనివల్ల కళ్లు పొడిబారిపోయి మంటపుట్టడం తగ్గుతుంది. దీనివల్ల కళ్ల మీద ఒత్తిడి, అలసట తగ్గి కళ్లు మాయిశ్చరైజ్ అవుతాయి.

eyesight

కంటి వ్యాయామాలు : కంటి వ్యాయామాలు చేయడం వల్ల కళ్ల మీద ఒత్తిడిని తగ్గించి రిలీఫ్ పొందవచ్చు. దీనివల్ల నొప్పి, చిరాకు అసౌకర్యం తగ్గుతుంది. ఇలాంటి వ్యాయామాల్లో కొన్ని కళ్లను గుండ్రంగా తిప్పడం, ఫోకస్ ను ఒకే దానిమీద కాకుండా మారుస్తూ ఉండడంలాంటివి.
undefined
కృత్రిమ కన్నీటి ద్వారా మీ కంటిని మాయిశ్చరైజ్ చేయచ్చు. దీనివల్ల పొడిబారే సమస్య నుండి విముక్తి లభిస్తుంది. చిరాకు, నొప్పి తగ్గుతుంది. దీనికోసం మీ కంటి డాక్టర్ ను సంప్రదించి అవసరమైన ఐ డ్రాప్స్ ను వాడండి.
undefined
స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్లని పదే పదే ఆర్పేలా జాగ్రత్త తీసుకోండి. కనీసం నిమిషానికి రెండు సార్లైనా కళ్లు కొట్టేలా మిమ్మల్ని మీరు ట్రెయిన్ చేసుకోండి. దీనివల్ల కళ్లు పొడిబారడం, తద్వారా నొప్పి తగ్గుతాయి.
undefined
click me!