`ఫ్యామిలీస్టార్‌` కాంబోలో మరో సినిమా ఫైనల్‌.. దర్శకుడు, స్టోరీ డిటెయిల్స్..

Published : May 04, 2024, 02:23 PM IST
`ఫ్యామిలీస్టార్‌` కాంబోలో మరో సినిమా ఫైనల్‌.. దర్శకుడు, స్టోరీ డిటెయిల్స్..

సారాంశం

విజయ్‌ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది. తాజాగా దాన్ని ప్రకటించారు. దర్శకుడితోపాటు, సినిమా జోనర్‌ ని కూడా ప్రకటించారు.   

విజయ్‌ దేవరకొండ హీరోగా నిర్మాత దిల్‌ రాజు `ఫ్యామిలీ స్టార్‌` చిత్రాన్ని రూపొందించారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గత నెలలో విడుదలై పరాజయం చెందింది. భారీ నెగటివిటీ కారణంగా కొంత కిల్‌ అయితే, కథలో దమ్ములేకపోవడంతో మరికొంత నెగటివ్‌గా మారింది. మొత్తంగా థియేటర్లలో ఈ మూవీకి డిజాప్పాయింట్‌ కలెక్షన్లు వచ్చాయి. అయితే ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. టాప్‌లో చాలా రోజులు ట్రెండ్‌ అయ్యింది. 

ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రాబోతుంది. విజయ్‌ దేవరకొండ, దిల్‌ రాజు కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుంది. `ఫ్యామిలీ స్టార్‌` ప్రెస్‌మీట్‌లోనే దిల్‌ రాజు ఈ విషయాన్ని తెలిపారు. విజయ్‌ తో మరో సినిమా చేయబోతున్నామని తెలిపారు. తాజాగా ఆ మూవీని అధికారికంగా ప్రకటించారు. దీనికి దర్శకుడు రవికిరణ్‌ కోలా దర్శకత్వం వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ మూవీ కావడం విశేషం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 9న విజయ్‌ దేవరకొండ బర్త్ డే సందర్భంగా వెల్లడించబోతుంది టీమ్‌.

చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా గతంలో `రాజావారు రాణిగారు` చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ మూవీ మంచి ఆదరణ పొందింది. ఆ చిత్రంతోనే కిరణ్‌ అబ్బవరం హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మెప్పించాడు. రవికిరణ్‌ ఆ తర్వాత ఇప్పుడు దిల్‌ రాజు బ్యానర్‌లో విజయ్‌ దేవరకొండతో సినిమా చేస్తుండటం విశేషం. ఇక ఈ సినిమా బ్యాక్‌ గ్రౌండ్‌ విషయానికి వస్తే, దీన్ని రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. విలేజ్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని, కాస్త రా గా ఉంటుందని తెలుస్తుంది. ఇటీవల కాలంలే ఈ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ యాక్షన్‌ మూవీస్‌ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌ కూడా ఇదే కథతో రాబోతుండటం విశేషం. 

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్‌ తిన్ననూరితో ఓ మూవీ చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ప్రస్తుతం ఈ మూవీలో బిజీగా ఉన్నారు విజయ్‌ ఇటీవలే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది. నెక్ట్స్ రేపటి నుంచి వైజాగ్‌లో మరో షెడ్యూల్‌ ఉంటుందని సమాచారం. ఇందులో శ్రీలీల మొదట హీరోయిన్‌గా అనుకోగా, ఆమె తప్పుకుందట. ఆ తర్వాత రష్మిక మందన్నా పేరు వచ్చింది. ఆమెతోపాటు కన్నడ భామ రుక్మిణి, అలాగే `యానిమల్‌` బ్యూటీ త్రిప్తి పేర్లు పరిశీలనతో ఉన్నాయి. ఎవరు ఫైనల్‌ అనేది తెలియాల్సి ఉంది. గ్యాంగ్‌ స్టర్ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు గౌతమ్‌ తిన్ననూరి.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి