చంకల్లో చెమట పట్టకుండా ఏం చేయాలో తెలుసా?

First Published | May 4, 2024, 1:38 PM IST

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఒంట్లో నుంచి చెమటలు కారుతూనే ఉంటాయి. ముఖ్యంగా చంకల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల అక్కడ డ్రెస్ తడవడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చంకల్లో చెమటలు పట్టకుండా చేయొచ్చు. అదెలాగంటే..
 

స్నానం చేసిన తర్వాత..

కాలాలతో సంబంధం లేకుండా కొంతమంది వేడినీటితో స్నానం చేస్తుంటారు. ఎండకాలంలో కూడా వేడి నీటి స్నానం చేస్తుంటారు.చన్నీటి స్నానమైనా, వేడినీటి స్నానమైనా ఎండాకాలంలో చంకల్లో చెమట పట్టకూడదంటే మాత్రం స్నానం చేసిన వెంటనే దుస్తులను వేసుకోకూడదు. శరీరం పూర్తిగా ఆరిన తర్వాతే దుస్తులు వేసుకోవాలి. దీనివల్ల చెమట పట్టే అవకాశం తగ్గుతుంది. 
 

అండర్ ఆర్మ్ హెయిర్

చంకల్లో హెయిర్ ఎక్కువగా ఉంటే కూడా బాగా చెమట పట్టడంతో పాటుగా దుర్వాసన కూడా ఎక్కువగా వస్తుంటుంది. అందుకే ఈ హెయిర్ ను ఎక్కువగా ఉంచకండి. ఇలా చేస్తేనే చంకల్లోంచి దుర్వాసన రాదు. చెమట కూడా ఎక్కువగా పట్టదు.
 

Latest Videos


sweat

తినకూడని ఆహారాలు

మీరు హైపర్ హైడ్రోసిస్ తో బాధపడుతుంటే మాత్రం వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొవ్వు పదార్థాలు, వేడి, కారంగా ఉండే ఆహారాలను తినడం మానుకోండి. వీటిని మానేస్తేనే మీకు చెమట తక్కువగా పడుతుంది. ఒంటి దుర్వాసన కూడా తగ్గుతుంది. 

తినాల్సిన అహారాలు

ఎండాకాలంలో బయటకు వెళ్లినప్పుడు చంకల్లో చెమటలు పట్టడం చాలా కామన్. ఈ సీజన్ లో శరీరంలోని వాటర్ మొత్తం చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంటుంది. అందుకే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం కోసం నీళ్లను బాగా తాగడంతో పాటుగా ద్రాక్ష, కాకరకాయ, బ్రోకలీ, బచ్చలికూర, కాలీఫ్లవర్, చిలగడదుంప, ఆలివ్ ఆయిల్ ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి పండ్లను తినండి. దీంతో అండర్ ఆర్మ్ చెమట తగ్గుతుంది.
 

టైట్ గా ఉండే దుస్తులు 

చంక బిగుసుకుపోయే దుస్తులు లను ధరించడం వల్ల చంకల్లో చెమటలు బాగా పడతాయి. అందుకే వదులుగా, గాలి తగిలే దుస్తులను ధరించండి. దీనివల్ల చంకల్లో చెమటలు పట్టే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 
 


నీళ్లు తాగాలి

ఎండాకాలంలో నీళ్లను పుష్కలంగా తాగాలి. ఎందుకంటే ఎండల వల్ల శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోతుంది. దీంతో బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఈ కాలంలో నీళ్లను పుష్కలంగా  తాగండి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉణ్న ఆహారాలను కూడా తినడి. దీనివల్ల మీ శరీరం చల్లగా ఉంటుంది. చంకల్లో చెమట కూడా పట్టదు.
 

ధూమపానం మానేయండి

సిగరెట్లలోని నికోటిన్, కెఫిన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతాయి. అలాగే గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. అంతేకాదు చెమట గ్రంథులు ఎక్కువ చెమట పట్టేలా చేస్తాయి. అందుకే మీరు సిగరెట్ మానేయడం వల్ల చంకల్లో చెమట తగ్గుతుంది. 

click me!